కాళ్లకూరి నారాయణరావు
శ్రీకాళ్లకూరి ణారయణరావుగారు నాటకకర్తగా చిరస్మరణీయులు కావడానికి వారి చింతామణీ, వజ్రవిక్రయ నాటకాలు మూలకారణాలు. ఆ నాటకాలు బహుళంగా ప్రదర్శింపబడి, విజయవంతమైనవి.
కాళ్లకూరివారి సాంఘిక నాటకాలు మూడు-చింతామణి, వరవిక్రయము, మధుసేవ. ఈ మూడూ కూడ ఆనాదు సంఘంలో ప్రబలంగావున్న దురాచారాలను ఖండించడనికి వ్రాసినవే. ఈ మూడింటిలోను వరుసగా వేశ్యాసమస్య, వరవిక్రయ సమస్య, మధ్యపాన సమస్య చిత్రితమైనవి. వీరి ప్రతినాటకమూ ఒకేవిధంగా సాగింది-అంటే మంచివాదు, సద్గుణ సంపన్నుడు అయిన ఒక ఉన్నత కుటూంబానికి చెందిన గృహస్థు స్నేహితుల ప్రోద్బలంవల్ల దురాచారాలకు లోనుకావడం, భార్యాపుత్రాదులను విడనాడడం, తరవార తన తపు తెలుసుకొని దారికి రావడం. కొంత విలక్షణమైనది వరవిక్రయమే ! ఇందులోని ప్రధాన భూమిక మొదటినుంచీ పిసినారే !
ఈ నాటకాలన్నింటిని ప్రకరణాలు అన్నారు కాళ్లకూరివారు.
"చింతామణి" నాటకం చివరి అంకంలో ఇది కృష్ణ కర్ణామృత కర్త్ అయిన లీలాశుకుని కధగా పేర్కొనబదినప్పటికీ పూర్తిగా సాంఘికంగా సడిచింది. సరళమైన పద్యరచన దీని విజయానికి ఒక కారణము. సుబ్బిశెట్టి పాత్ర చిత్రణ కూడా మరొక ముఖ్యకారణము సుబ్బిశెట్టిపాత్ర తెలుగులో రూఢిపాత్రల (type-characters)కు మంచి ఉదాహరణ.
కన్యాశుల్కము పోయి వరశుక్లము జాతిని పీడించడం ప్రారంభించిన రోజులవి. ఆ దురాచారాన్ని విమర్శిస్తూ వ్రాసిన నాటకము వరవిక్రయము. ఎవరినైనా లోబిగా చెప్పదలచుకొంటే ఇందులోని ప్రధానభూమిక పేరుతో - సింగరాజు లింగరాఉ - అంటారు.
పైన పేర్కొన్న మూడు సాంఘికనాటకాలు గాక 'చిత్రాభ్యుదయము ' పర్మవ్యూహము ' అన్న మరి రెండు నాటకాలనుకూడ కాళ్లకూరివారు వ్రాసినారు.
'చిత్రాభ్యుదయము ' సారంగధరుని గురించిన కధ. సారంగధరుని గురించి ప్రచారంలోఉన్న కధలన్నీ అప్రమాణికాలని భావించి చిత్రాంగీ-సారంగధరులకు వివాహము చేస్తూ వ్రాసిన కాల్పనిక నాటకమిది. దీనికి వ్రాసిన