ఈ పుట ఆమోదించబడ్డది

తిరుపతి వేంకటకవులు

దివాకర్ల తిరుపతిశాస్త్రి (1871-1919)
చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి (1870-1950)

సంగీత నాటకసాహిత్యాన్ని పరాకాష్ఠకు తీసుకొనివెళ్ళినవారు తిరుపతి వేంకటకవులు. ఆంధ్ర మహా భారతంమీద వారికి భక్తి. అనురక్తి మెందు. అందుగల్ల భారతకధ నంతటినీ ఆరు నాటకాలుగా రూపొందించినారు. ఈ ఆరూ ప్రదర్శన యోగ్యమైనవే అయినా వాటిలో 'పాండవోద్యోగము,' 'పాండవ విజయము ' అనే నాటకాలు రెండూ కలిపి వేలకొలదిసార్లు ప్రదర్శితమై బావదాంద్రలోనూ ఎనలేని ప్రజాభిమానాన్ని చూరగొన్నవి. తిరుపతివేంకటకవుల పేరు చెప్పితే పాండవనాటకాలు, పాండవనాటకాల పేరు చెప్పితే తిరుపతి వేంకటకవుల స్మృతికి వచ్చేటంతగా ఇవి ఖ్యాతి గడించినవి.

తిరుపతి వేంకటకవుల నాటకపద్యాలలోని ప్రధాన లక్షణము ప్రసన్నతా గుణము. అలతిఅలతి పదాలతో, మృదు మధురోక్తులతో సామాన్య జనానీకానికి సైతము అర్ధమయ్యే భాషలో పద్యాలు రచించి ప్రజాహృదయాలను ఆకట్టుకొన్నారు. భారతకధ చాలాపెద్దది. అందులోనుంచి నాటకంలో నిబందించడానికి నాటకీయతగల ఘట్టాలను ఎన్నుకోవడంలో తిరుపతివేంకటకవుల ప్రతిభ గోచరిస్తుంది. వారు ఎన్నుకొన్న ఘట్టాలు నాటకీయతతో తొణికిసలాడుతూ ఉంటాయి. వారి పాండవ నాటకాలలో స్త్రీ పాత్రలకు ప్రాధాన్యము తక్కువ. అందువల్ల ప్రదర్శించడానికి ఎక్కువ అనువుగా కూడా ఉంటాయి.

తితుపతివేంకటవవులు సంస్కృతనాటక లక్షణాలనే ఎక్కువగా అనుసంధించినారు. అంకాలను రంగాలుగా విభజించకుండా విష్కంధాదులను ప్రవేశ పెట్టినారు. అయితే వందలకొలది మద్యాలను రచించినా పాటలు చొప్పించలేదు. వీరు పాండవ నాటకాలలో ఎక్కువగా ఆంధ్రమహాభారతాన్నే అనుసరించినా, పాత్ర చిత్రణలో, సన్నివేశ కల్పనలో అక్కడక్కడా స్వతంత్రించినారు. ధర్మరాజు, అశ్వత్ఠామల పాత్ర చిత్రణ, కృష్ణరాయభరరంగంలో సన్నివేశ కల్పన వీరి రచనా నైపుణ్యానికి నిదర్శనాలు.

వీరు రిచించిన స్వతంత్ర్ర నాటకాలు 14, అనువాదాలు 7, ప్రహసనాలు 5.