ఈ పుట ఆమోదించబడ్డది

చిలకమర్తి లక్ష్మీనరసింహము

ప్రసిద్ధ నాటకకర్తగా, హాస్యనవలా రచయితగా, సంఘ సంస్కర్తగా శ్రీ చిలకమర్తి తన దేశానికి, భాషకు ఎనలేని సేవ చేసినారు. దేశాభిమానము, ఆంధ్రాభిమానము, హరిజనోద్ధరణము - ఇవి అన్నీ ఆయనకు సహజగుణాలు.

1899 జనవరిలో ఇమ్మానేని హనుమంతరావు నాయుడుగారు తమ హిందూనాటక సమాజం కోసము కీచకవధను నాటకంగా వ్రాసి ఇమ్మని పంతులు గారిని కోరినారు. పంతులుగారు అందుకు అంగీకరించినారు. ఇదే వారి నాటక రచనకూ, గ్రంధరచనకూ కూడా ఆరంభము.

పందులుగారు మొత్తము పది స్వతంత్ర నాటకాలను రచించినారు; పార్వతీ పరిణయాన్ని, 12 భాసనాటకాలను అనువదించినారు. ఇవికాక ఎన్నో ప్రహసనాలను కూడా వ్రాసినారు.

పంతులుగారి స్వతంత్ర నాటకాలన్నీ ఎవరో ఒక సమాజంవారి కోరగా వ్రాసి ఇచ్చినవే ! కీచక వధ, ద్రౌపదీ పరిణయము అన్న రెండు నాటకాలు రాజమహేంద్రవరంలోని హిందూనాటక సమాజంకోసం వ్రాయబడినవి. ఆ నటులలో ఎవరికీ పధ్యాలు పాడటం రాకపోవడంవల్ల అవి ముందు వచన నాటకాలుగా మాత్రమే వ్రాసినారు. ఆ తరవాత ప్రచురణ సమయంలో పద్యాలు పొందుపరచడంజరిగింది.

పంతులుగారి నాటకాలలో 'గయోపాఖ్యానము ' ఎంతొ ప్రఖ్యాతి చెందిన నాటకము, నాలుగు దశాబ్ధాలపాటు ఈ నాటకాన్ని ప్రదర్సించని సమాజము ఆంధ్రదేశంలో లేదంటే అతిశయోక్తి కాదు.

ద్రౌపదీ పరిణయము, శ్రీరామ జననము, గయోపాఖ్యానము వంటి నాటకాలలో ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులుగారు స్త్రీ పాత్రలు ధరించి అద్భుతంగా నటించేవారని చిలకమత్రివారే తమ స్వీయచరిత్రలో చెప్పుకొన్నారు.

గయోపాఖ్యానానికి ఇంత ప్రఖ్యాతి రవటానికి ఆ నాటకంలోని పద్యాలు కూడ ఒక ముఖ్యమైన కారణము. పందుత్లుగారి వచనంవలెనే మద్యంకూడ ఎంతో సరళంగా ఉంది. పండిత పామరులను సమంగా రంజింపజేస్తుంది.

వీరు వ్రాసిన మరో మంచి నాటకము 'ప్రసన్న యాదవము.' ఇందులోని కధ నరకాసురవధ. నటులనుదృష్టిలో ఉంచుకొని నాటకాలు వ్రాయడం చిలకమర్వారిలో పరాకాష్టను అందుకొన్నది.