గురజాడ వేంకట అప్పారావు
శాస్త్రిగారి స్వతంత్ర నాటకాలలో సంస్కృతాంగ్ల నాటకరీతులు రెండూ గోచరిస్తాయి. వీరి నాటకాలు గద్య, పద్య, గేయాత్మకాలు. సంస్కృతనాటక లక్షణాలను ఎక్కువగా పాటించినా ఆంగ్లల్ల్ నాటకాలలోవలె అంకాలను "స్థలములు" అనే పేరుతో రంగాలుగా విభజించినారు.
కధావిన్యాసంలో, సజీవపాత్ర సృష్టిలో, రసపోషణలో శాస్త్రిగారుసిద్ధహస్తులు, వారి కధావిన్యాస నైపుణ్యానికి "ప్రతాపరుద్రీయము", వారి సజీవ పాత్ర సృష్టికి 'యుగంధరుడు,' 'పేరిగాడు,' 'చెకుముకిశాస్త్రై,' రసపోషణకు 'బొబ్బిలి ' ఉత్తమ ఉదాహరణలు. వీరరసంతోపాటు హాస్యరసము వేదంవారి అభిమానానికి పాత్రమైనది. అక్కడక్కడా పూర్వకాలపు మోటుహాస్యము తళుక్కుమన్న మొత్తంమీద హాస్యరసాన్ని బాగా పోషించినాడనే చెప్పవలె. ప్రతాపరుద్రీయంలోని హాస్యము ఉత్తమ హాస్యానికి, 'ఉష,' 'బొబ్బిలి ' నాటకాలలోని హాస్యము నీచహాస్యానికి ఉదాహరణలు.
పాత్రోచిత భాషాప్రయోగంలో శాస్త్రిగారి నైపుణ్యాన్ని ప్రతాపరుద్రీయము చాటి చెబుతుంది. కధ బిగింపు, పాత్రచిత్రణ్ ప్రతిభ ఈ నాటకాలలో పరాకాష్టను అందుకొన్నాయి. ఆదుగడుగునా హాస్యము తొణికిసలాడుతుంది. పేరిగాని 'దర్బారుసీను,' పిచ్చివాని సీనులు హాస్యరసానికి ఆటపట్టులు, పిచ్చివాని రంగాలు ద్వ్యర్ధి కావ్యాలవలె నడుస్తాయి. తేలుగు నాటకసాహిత్యానికి అద్ అమూల్య మణిభూషణము.
తెలుగు నాటకాలలో ప్రప్రధమంగా అంతర్నాటకము ప్రవేశాపెట్టినది శాస్త్రిగారే. ఉదా|| ప్రతాపరుద్రీయము.
వేదంవారి స్వతంత్ర నాటకాలు 3; అనువాదాలు 7.
గురజాడ వేంకట అప్పారావు
తెలుగునాట శృంగార గాధలనే ఎక్కువగా రూపొందించుతున్న కాలంలో అతిక్లిష్ట వ్యావహారిక భాషావాదానికి పట్టుకొమ్మ అప్పారావుగారు (1862-1915), నాటకాలు వ్యావహారికభాషలో రచించి మెప్పించవచ్చునని నిరూపించడానికి అతిక్లిష్ట సాంఘిక సమస్యలతోకూడిన 'కన్యాశుల్కం ' అనే