ఈ పుట ఆమోదించబడ్డది

కర్తలేగాని మంచి పరిశోధకులుకూడా, వారు ఆంగ్లంలో వ్రాసిన 'ప్రపంచనాటకచరిత్ర" (1908) వారి పరిశోధనకు గీటురాయి.

శ్రీనివాసరావుగారు మొత్తము ముప్పది నాటకాలవరకు రచించినారు. అందులో ఎక్కువ చారిత్రక నాటకాలు, కొన్ని పౌరాణికాలు, సాంఘికాలు; మరికొన్ని చారిత్రిక - పౌరాణిక వాతావరణంలో వ్రాసిన కాల్పనిక నాటకాలు.

వీరి మొదటినాటకము 'సుందినీ పరిణయము ' (1891-95). 1902 ప్రాంతాల 'సుమనోరమ ' సభకు ఆధ్యక్షులైననాటినుంచి వారి నాటక రచన ఇతొధికంగా సాగింది.

శ్రీనివాసరావుగారు "చారిత్రక నాటక పితామహులుగా" ప్రఖ్యాతి పొందినారు. ఈ ఖ్యాతిని వీరికి సంపాదించిపెట్టిన నాటకము "రామరాజు చరిత్రము" లేదా Fall of Vijayanagaram, తల్లికోట యుద్ధంలో తన రాజ్యాన్ని కోల్పొయీ విజయనగర సామ్రాజ్యపరనానికి కారకుడైన రామరాజు కధ ఈ నాటకానికి ఇతివృత్తము. ఇందులోని రుస్తుం పాత్రకు, తద్వారా ఈ నాటకానికి ఖ్యాతితెచ్చిపెట్టినవాడు శ్రీ బళ్లారి రాఘవ. 1918లో ఈ నాటకాన్ని ప్రదర్శించరాదని ఆంగ్లప్రభుత్వము నిషేధించడమే నాదు ఈ నాటకానికి గల ఖ్యాతిని తెలియజెప్పుతుంది.

వేదం వేంకటరాయశాస్త్రి

సంస్కృత రూపక రసమునేగాక్, "హూణరూపక రసంబుగూడ నుదరంబు నిండాక దిగద్రావి గర్రూ త్రేచిన" నాటక కళావేత్త వేదం వేంకటరాయ శాస్త్రిగారు (1853-1929). శాస్త్రిగారికి ఆంధ్రదేశమన్నా, ఆంధ్రభాషల్ అన్నా మహాభిమానము. ఈ ఆభిమానము ప్రేరణకాగా అంధ్రులధీశక్తికి శౌర్యపరాక్రమాలకు ప్రతీకలుగా 'ప్రతాపరుద్రీయము.' 'బొబ్బిలి యుద్ధము ' అనే రెండు చారిత్రక నాటకాలు రచించినారు. మూడవ్ నాటకము "ఉష" - పౌరాణికము, సంస్కృత నాటక ప్రాశస్త్యాన్ని తెలుగువారికి తెలియజేయడానికి సంస్కృతంనుండి 'శాకుంతలము,' 'రత్నావళి ' మొదలైన రూపకాలు అనువదించినారు. పాత్రోచిత భాషావాదానికి శిలాశాసనముగా "గ్రామభాషా నివంధనము" అనే లక్షణ గ్రంధాన్ని రచించినారు. సంస్కృత లక్షణగ్రంధమగు "సాహిత్య దర్ప