7. నాటకంలో చాయానాటకము. ఉదా|| భూమికోసం, ఆసామి.
8. నటీనటులను ప్రేక్షకులలో కూర్చోపెట్టడం, వరితో మాటాడించడం ఉదా|| విశ్వసాంతి, గాలిమేడలు.
9.స్వాప్నికజగత్తు చిత్రణ. ఉదా|| తీరనికోర్కెలు, గాలిమేడలు.
ధర్మవరం రామకృష్ణమాచాత్యులు
"ఆంధ్రభాష నాటకమున కర్హమైనభాష" కాదనే ఆపోహను తొలగించడానికి నాటకరచనకు పూనుకొన్న మహనీయుడు ధర్మవరం రామకృష్ణమాచార్యులు (1852-1912). సంస్కృతాంగ్లనాటకాలలోవలెనే "వృత్తవాక్యరూపముగ" నాటకాలు రచించడానికి వీరు ఉద్యమించి గద్య, పద్య, గేయాత్మక నాటకరచనకు శ్రీకారముచుట్టినారు. వీరి ప్రప్రధమ తెలుగు నాటకము చెత్రనళీయము. దీనితో తెలుగులో వచన నాటకయుగము ప్రారంభమైంది. అందుకే ఆచ్దార్యులవారిని యుగకర్తగా, ఆంధ్రనాటక పితామహునిగా పరిగణించడం.
ధర్మవరంవారు సంస్కృతాంగ్ల పార్శీ నాటకరచనా పద్ధతులను రంగరించి ఒకకొంగొత్త నాటకరూపాన్ని సృజించినారు. సంస్కృతాంగ్ల నాటకాలలో వెలె పద్యాలు, మాటలు పెట్తినారు. పార్శీనాటకాలలోవలె పాటలు పొందుపరచినారు. ఆంగ్లనాటకాలలోవలె రంగవిభజనచేసినారు. దీర్ఘస్వగతాలు, పూర్వోత్తరరంగాలు చొప్పించినారు. వీరి నాటకాలలొని పద్యాలు ప్రబంధ ఫక్కీల్జో కట్టుగా, మనోరంజకంగా ఉంటాయి. స్వయంగా కొత్తచందస్సులు ప్రస్తరించుకొని పాటలు, రాగమాలికలు, సంవాద కీర్తనలు రచించినారు. సామాన్యంగా పాత్ర మానసికావస్థను, అంతరసమ్ఘర్షణను ద్యొతకము ఛెయడానికి దీర్ఘస్వగతాలు వాడినారు. నాటకంలోని నీతినిబోధించే ఉత్తరరంగము, ఒకలేఖ వీరినాటకాలలో ఎక్కువగా కనిపిస్తాయి.
ధర్మవంవారు జాతీయవారి; సంఘసంస్కరణాభిలాషి. తన కాలంలో విజృంభించిన జాతీయొద్యమాలకు, సంఘసంస్కరణోద్యమాలాలకు వెంటనే ప్రతిచలించి, సందర్బశుద్ధి ఉన్నా లేకపోయినా ఆయా ఉద్యమాల స్వరూపాలను తమ నాటకాలలో చిత్రించినారు. 'చంద్రహాస ' నాటకంలో ఉప్పుపన్ను, ప్రమీ