ఈ పుట ఆమోదించబడ్డది

ఆకాలంలోవచ్చిన నాటకాలు - వీరేశాలింగంగారి ప్రహసనాలవంటివి ఏకొద్దో తప్ప - తక్కినవన్నీ, గద్య, పద్య, గేయాత్మకాలు; పౌరాణికాలు, చరిత్రాత్మకాలు; సాంప్రదాయిక సూత్రాలను బలపరిచే నాటకాలు. ఈ పరిస్థితులలో, "క్లిష్ట, సాంఘిక పరిస్థితులతోకూడిన ఆధునిక ప్రజాజీవితాన్ని వట్టి ప్రహసనాలతో తప్ప రచయితలు ద్యోతకం చేయడానికి అశ్రద్ధ వహిస్తున్నారు. చౌకబారు శృంగారకధలు నాటకంగాల్ వ్రాయడమేగాని రచయితలలో కల్పనాశక్తి కనిపించడంలేదు. కొద్ధిమంది రచయితల నాటకాలలో మాత్రమే నాటకశిల్పం గోచరిస్తున్నది"1 అని చింతించి గురజాడ అప్పారావు క్రిష్టమైన సాంఘిక పరిస్థితులతో కూడిన ఆధునిక ప్రజాజీవితాన్ని చిత్రిస్తూ 1897 లో 'కన్యాశుల్కము ' అనే నాటకము ప్రకటించినారు. ఇది సాంఘిక వచన నాటకము. భాష వ్యావహారికము. ఈ నాటకంలో తెలుగునాటకసాహిత్యచరిత్రలో ఇంకో నూతన శకము ప్రారంభమైనది. కన్యాశుల్క నాటకరచనతో వాస్తవికతావాదానికి పట్టాభిషేఇకమయింది; వ్యావహారిక భాషావాదానికి లక్ష్యము రొరికింది. ఇందులోని పాత్ర చిత్రణ, సన్నివేశకల్పన, హాస్యము సర్వులను ముగ్దులను చేసినవి. గురజాడవారి అపూర్వసృష్టికి గిరీశం, మధురవాణి8 నిదర్శనాలు. ఇద్ అభ్యుదయ నాటక సాహిత్యానికి పునాదిగా భాసిల్లింది. వ్యావహారికభాష కన్యాశుల్కంవంటి ప్రహసనప్రాయరచనలకె గాని గంభీర నాటకాలకు పనికిరాదనే ఆపోహను తొలగించడానికి గురజాడవరు 'బిల్హణీయము ' అనే నాటకాన్ని రచించి చూపడానికి ప్రయత్నించినారు.

కన్యాశుల్కము వెలువడిన సంవత్సరమే (1897) ఇంకో గొప్పనాటకము ప్రతాపరుద్రీయము వెలువడింది. పాత్రపోషణలో, కధావిన్యాసంలో, సంభాషణారచనలో వేదంవారి ప్రతిభ ఈ నాటకంలో అడుగడుగునా గోచరిస్తుంది. పాత్రోచిత భాషావాదానికి సుస్థిరస్థానము లబింపజేసింది వేదంవారే ! ఈ నాటకంలో వీరు పాశ్చాత్య నాటకాల లక్షణాలకంటె సంస్కృతనాటకాల లక్షణాలే ఎక్కువగా పాటించినారు. ఈ ఒరవడినే చారిత్రక నాటకాలు వెలువడసాగాయి.

ధర్మవరంవారివలెనె ఒక ప్రత్యేకముద్రతో నాటకాలు రచించి పేరుగాంచినవారు పానుగంటి లక్ష్మీనరసింహారావుగారు. వీరి నాటకాలలో వైవిధ్యము


1. Modern life which presents--