తెలుగుదేశంలో అంతవరకు రంగస్థలము ఆరుబయలు రంగస్థలమే, ధార్వాడవారు అట్లాకాక, నాలుగువైపులా మూసినశాలలో, మూడువైపులమూసిన రంగస్థలజ్ంమీద, పైకి క్రిందికి కదిలేతెరలతో, నేపధ్యజంత్ర సహకారంతో నాటకాలు ప్రదర్శింఛేసరికి తెలుగువారికి కొత్తనాటక ప్రపంచము గోచరించినది; నూననోత్తేజము కలిగింది. ధార్వాడ నాటకాలు ప్రేరనగా పరిణమించినవి. తొలుదొల్త వీనివల్ల ప్రభావితమైనది కందుకూరి వీరేశలింగంగారే, రాజమహేంద్రవరంలో నాటకాలాడి వదలివెళ్లిన తాటాకు పాకలోనే చమత్కార రత్నావళి, రత్నావళి అనే రెండు నాటకాలు ప్రదర్శింపజేసి ప్రప్రధమ ప్రయోక్తలుగా పంతులుగారు ఖ్యాతిగదించినారు. చమత్కార రత్నావళి షేక్స్ పియర్ "కామెడీ ఆఫ్ ఎర్రర్స్" (Comedy of Errors) అనే నాటకానికి, రత్నావళి శ్రీహర్షుని సంస్కృత రత్నావళికి అనువాదాలు. ఈ విధంగా ఆధునికాంధ్ర నాటకరంగ మావిర్భవించినది.
ధార్వాడవారివలె నాటకాలు ప్రదర్శిచవలెననే ఉత్సాహంతో ప్రతి పట్టణంలొనూ నాటకసమాజాలు వెలిసినవి. ప్రదర్శించడానికి నాటకాలు కావలె కాబట్టి రచయితలు కలముపట్టినారు. ఆదర్శము కాదగిన నాటకాలుగాని నాటక లక్షణ గ్రంధాలుగాని తెలుగులోలేవు. అందుచేత నాటి నాటకరచయితలు పగటివెషాలువంటి జానపద నాటకరూపాలను, సంస్లృతనాటకాలను, ధార్వాడవారి నాటకాలను ఒకవడిగా పెట్టుకొని నాటకాలు వ్రాయసాగినారు. ఆనాటివరు రిచించిన నాటకాలు వచననాటకాలు. ఎక్కువగా పౌరాణికాలు. అయితే స్వతంత్ర నాటకాలతోఫాటు అనువాదాలుకూడా ఈ కాలంలో ఎక్కువగా వెలువడసాగినవి. చిలకమర్తి లక్షీనరసింహం ప్రభృతులు పౌరాణిక గాధలను తీసికొని వచనతాటకాలు వ్రాసినారు. నాదెళ్ళ పురుషోత్తమశాస్త్రిగారు నాటకాలలో పాత్రోచిత భాషా ప్రయోగానికి శ్రీకారముచుట్టినారు.
సర్కారు జిల్లాలలొ ఇట్లా వచన నాటకాలు ఎక్కువగా ప్రదర్శిస్తుంటే బళ్ళరినుంచి కొత్తరరహా నాటకాలు వెలువడసాగివవి. ధర్మవరం గోపాలచార్యులుగారు ఒక తెలుగు నాటకమువ్రాసి అడించగా అది రక్తికట్టకపోవడంతో తెలుగుభాష నాటకానికనువైనది కాదనేప్రధబయలుదెరినది. ఆఅపప్రధనుపోగొట్టి తెలుగుబాష నాటకరచనకు అనువైనదని ఋజువు చేయడానికి ధర్మవరం రామకృష్ణమాచార్యులుగారు నాటకరచనకు నడుముకట్టినారు. సంస్కృతాంగ్లనాటక సంప్ర