ఈ పుట ఆమోదించబడ్డది

ఇవిగాక అన్యాపదేశరూపకాలు (Allegorical Plays) అనేపేరుతో ఇంకోరకం నాటకాలు బయలుదేరినవి. వాటిలో బుద్ధి, మోహము, వివేకము, మనస్సు, ప్రవృత్తి వంటి అపురూప పాత్ర లున్నవి. అశ్వఘోషుని మూడవ నాటకము ఇట్లాంటి అన్యాపదేశనాటకమైనా, ఈ రకం రూపకాలు పరాకాష్ఠకు చేరినది ఈ యుగంలోనే, కృష్టమిశ్రుని "ప్రబోధ చంద్రోదయము" వేంకటనాధుని (వేదాంత దేశికుని) "సంకల్ప సూర్యోదయము" ప్రసిద్ధిచెందిన అన్యాపదేశరూపకాలు.

అయితే ఈ క్షీణయుగంలో కూడ కొన్ని మంచి సాంఘిక రూపకాలు రాకపోలేదు. 7వ శతాబ్ధికి చెందిన పల్లవరాజు మహేంద్రవర్మ రచించిన 'మత్తవిలాసము ' ఆ తర్వాతిరచనలలో మేలుబంతిల్. ఈ మత్తవిలాసము సాంఘిక ప్రహసనము. ఇందులో శైవులమీద, కాపాలికులమీద విమర్శ ఎక్కువ. ఈరకం రూపకాలలో నిర్ధాక్షిణ్యమైన, వ్యంగ్యభూతమైన అవహేళన తీవ్రరూపంలో గోచరిస్తుంది. మహేంద్రవర్మ రచించిన మరో ప్రహసనము "భగవదజ్జుకము". అయితే, కొంతమంది విమర్శకులు దీనిని బోధాయనుడు అనేవ్యక్తి రచించినట్టు అభిప్రాయపడినారు. లటకమెళము, దూర్త సమాగమము, హాస్యార్ణవము మొదలైనవి ప్రహసనశాఖకు చెందిన మరికొన్ని ప్రసిద్ధరచనలు.

సాంఘిక-అవఃహేళనకు దశరూపకాలలోని ఒక భేదమైన భాణాన్ని రూపక రచయితలు ఎక్కువగా ఉపయోగించుకొన్నారు. చతుర్భాణి ఇందుకు మంచి ఉదాహరణ. ఉభయాభిసారిక, పద్మప్రాభృతకము, దూర్తవిత నందము, పాదతాడితకము - అని చతుర్భాణిలోని నాలుగు భాణాలు.

భాసుడు.

సూత్రధార కృతారంభై:
నాటకైర్బహు భూమికై:
నవతాకైర్యశో లేభే
భాసో దేవకులై రివ"

అని పేరుగాంచిన సంస్కృత నాటకకర్త భాసుడు. భాసుని రూపకాలలో ఏ ఒకటిరెండు రూపకాలలోనో తప్ప తక్కినవాటిలో నటీ సూత్రధారుల సంభాషణ, నాటకంపేరు, రచయితపేరు, ఋతుగానము మొదలైన సాంప్రదాయిక ప్రస్తావనాంగాలు కనిపించవు. సూత్రధారుడు ఒక్కడే ప్రవేశించి నాందీ