భవభూతి నాటకాలు
వివాదాస్పదము. దశరూపక కర్త ధనంజయుడు ఇతని ముద్రారాక్షస నాటకాన్ని పేర్కొనడంచేత, విశాంఅదత్తుడు క్రీ. శ. 10 వ శతాబ్దికి పూర్వుడని భావించవచ్చు. ఇతని ముద్రారాక్షస నాటమమొక అపూర్వరచన. ఇది చరిత్రాత్మకము. ఇందులో రాజకీయపుటెత్తులకు, పై ఎత్తులకు ప్రాధాన్యమెక్కువ. మానవుని చిత్తవృత్తి, బలహీనతలు ఆధారంగా కధ ముందుకు వెనకకు నడుస్తుంది. ఇందులో శృంగారములేదు. నామమాత్రమైన ఒక్కపాత్రను తప్పిస్తే, స్త్రీపాత్రలు కూడలేవు. అయినా ఎంతో ఆకర్షణీయంగా నాటకీయతతో పొంగిపొరలుతూ ఉంటుంది. విశాఖదత్తుడే దేవీచంద్రగుప్తము అనే ఇంకొక రూపకము వ్రాసినాడని చెబుతారు కాని, అది ఇంతవరకు లబ్యముకాలేదు. శ్రీహర్షుడు వైషధ కర్త అయిన హర్షునికంటె భిన్నుడు. ఈ శ్రీహర్షుడుల్ శ్రీహర్షవర్ధన శిలాదిత్య బిరుదాంకితుడు. 7వ శరాబ్ధంలో కన్యాకుబ్జాన్ని పాలించినరాజు. శ్రిహర్షుని నాటకాలు మూడు-రత్నావళి, ప్రియదర్శిక, నాగానందము. ఈ నాటకాలను నాటి విదేశీయాత్రికుడు హ్యూయన్ సాంగ్ ఎంతగానో మెచ్చుకొన్నాడు. ఈ మూడు ఎక్కువగా ప్రదర్శితాలైనట్లు తెలుస్తున్నది. ఈ నాటకాలను శ్రీహర్షుని ఆస్థానకవి బాణుడు రచించి శ్రీహర్షుని పేరు పెట్టినాడని వదంతి ఉన్నది; కాని అందుకు తగిన ఆధారాలు లేవు.
భవభూతి జగద్విఖ్యాతిగాంచిన మహాకవి. కన్యాకుబ్జరాజయిన యవర్మ ఆస్థానకవి. భవభూతిని రాజతరంగిణి పేర్కొనడంచేత ఇతడు విర్బేయుడని కొందరు, ఆంధ్రుడని కొందరు అభిప్రాయపడుతున్నారు. భవబూతి కశ్యపగోత్రుడు. శ్రీకంఠబిరుదాంకితుడు, పదవాక్యప్రమాణజ్ఞడు. ఇతడు రచించిన నాటకాలు మూడు-- మహావీరచరితము, మాలతీ మాధవము, ఉత్తరరామచరితము. ఈ మూడు నాటకాలు ఉజ్జయినీలో కాళప్రియనాధుని మహోత్సవాలలో ప్రదర్శించినట్టు తెలుస్తున్నది. ఈ మూడింటిలో ఉత్తరరామచరిత ఎక్కువ ప్రసిద్ధి పొందినది.
భవభూతి తన నాటకాలలో నాటకీతకంటె కవిత్వానికి ఎక్కువ ప్రాధాన్యమివ్వడంవల్ల అతని నాటకాలు ప్రయోగసౌలభ్యము కోల్ఫోయినవని, దృశ్యత్వం దృష్ట్యా అతని నాటకాలలొనే సంస్కృత నాటకరంగంలో క్షీణతా బీజాలు మొలకెత్తినవని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు.