ఎక్కువగా తెలియదు. ప్రచురితమయిన తరవాత ఈ రూపకాలు కర్తృత్వంమీద, భాసుని కాలంమీద తర్జనభర్జనలు జరిగాయి.
భరతమునికంటెల్ పూర్వుడైనా తరవాతివాడైనా నాట్యశాస్త్ర సూత్రాలకు భిన్నంగా రచనచేసిన ఏకైకల్ నాటకకర్త భాసుడే అని తలంచవచ్చు. ఇతని అసలుపేరు భావకుడని, ఇతడు దాక్షిణ్యాత్యుడని ప్రతీతి.
భాసుని తరవాతి నాటకకర్త శూద్రకుడు. ఇతని కాలము క్రీ.పూ. 3, 2 శతాబ్దులని కొందరు, క్రీ.శ. 6, 7 శరాబ్దులని కొందరు అభిప్రాయ పడుతున్నారు. మరికొందరు శూద్రకుడు కల్పితపురుషుడని, ధావకభాసుడానే కవి ఈ పేరుతో "మృచ్చకటిక" ను వ్రాసినాడని అభిప్రాయ పడుతు;న్నారు. శ్రీ వి.వి.పులాల్కర్ అనే చరిత్రకారుని వ్రాతనుబట్టి శూద్రకుడు ఆంధ్ర రాజని ఊహించడానికి అవకాశమున్నది.
భాసుని దరిద్రచారుదత్తరూపకాన్ని పెంచి శూద్రకుడు "మృచ్చకటిక"ను వ్రాసినాడని కొందరు, శూద్రకుని "మృచ్చకటిక"ను కుదించి భాసుడే "దరిద్రచారుదత్తము" వ్రాసినాడని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఏమైనా సంస్కృతనాటక సాహిత్యంలో "మృచ్చల్కటిక" ఒక విశిష్టరచన. ప్రపంచ ఖ్యాతిగాంచిన సంసృతనాటకాలలో అదిఒకటి అని చెప్పక తప్పదు.
సంస్కృతనాటకర్తలలో అగ్రేసడు, కవికులగురువు అయినవాడు కాళిదాసు. ఇతడు ఉజ్జయినీవాసి. విక్రమాదిత్యుని నవరత్నాలలో ఒకడు. క్రీ. శ. 4వ శతాబ్దంలో జీవించి ఉంటాడని చరిత్రకారులు అభిప్రాయము. కాళిదాసునాటకాలు మూడు; 1.మాళవికాగ్నిమిత్రము 2.విక్రమోర్వశీయము, 3.అభిజ్ఞాన శాకుంతలము. ఈ మూదూ మూడురత్నాలయినప్పటికి, వీటిలో "అభిజ్ఞాన శాకుంతలము" విశ్వవిఖ్యాతి పొందినది. ఈ నాటకాలలో సంస్కృతరూపక సాహిత్యము పరాకాష్టకు చేరుకొన్నది. "శాకుంతల" నాటకాన్ని 1789లో సర్ విలియం జోన్స్ (Sir William Jones) ఇంగ్లీషు లోకి అనువదించడంతో దానికి విశ్వవిఖ్యాతి లభించినది. సంస్కృతనాటకాలను పాశ్చ్యాత్యులు ఆదరించడం ప్రారంభించినారు. కాళిదాసు యుగము సంస్కృత రూపక చరిత్రలో స్వర్ణయుగమైనది.
కాళిదాసు తరవాత సంస్కృతనాటక సాహిత్యంలో ప్రముఖస్థానము వహించినవారు - విశాఖదత్తుడు, శ్రీహర్షుడు, భవబూతి, విశాఖదత్తునికాలము