గల పేర్లను శ్లోకరూపంలో చదువుతారు. వీరి సహకార వాద్యాలు హార్మనీ, మద్దెల, తాళాలు.
తోలుబొమ్మలవారికి ధ్వనిప్రభావ(Sound effect) విషయం కూడ తెలుసు. రాక్షసపాత్రల వికటాట్టహాసము, యుద్ధమి మొదలైనవి ప్రదర్శించడానికి తదనుగుణమైన ధ్వనులను వీరు నోటితోను, మద్దెలతోను మాత్రమే గాక రెందు కొయ్యచెక్కలు ఒకదానిమీద ఒకటిపెట్టి గబగబ తొక్కడంద్వారా కూడ కలిగిస్తారు. వీరి వాచికము రసోచితంగా ఉండి రంజింపజేస్తుంది.
హరికధలో పిట్టకధలవలె వీరూ తోలుబొమ్మలాట మధ్యలో కేతిగాడు, బంగారక్క ప్రహసనము ప్రదర్శిస్తూఉంటారు. ఈ ప్రదర్శనము కొంత అసభ్యంగా ఉన్నా గ్రామీణులను ఎక్కువగా ఆకర్షిస్తుంది. తోలుబొమ్మల చిత్రకళాశైలి తంజావూరు, లేపాకాక్షిశైలి, సంగీతము మరాఠీ శైలికి దగ్గరగా ఉంటుంది. సంగీత సాహిత్యాఅలేగాక చిత్రకళ, శిల్పకళ, వాస్తుకళలు ఈ కళారూపానికి ఎంతో అవసరము. అందుకే దీనిని పంచకళాత్మకరూప మంటారు.