ఈ పుట ఆమోదించబడ్డది

వ్యగ్యంగా రాజు) ప్రవేశాన్ని సూచించి. సభాసదులను నిశ్శబ్ధంగా ఉండవలనని కోరి నిష్క్రమిస్తాడు. ఆ తరవాత పాత్ర తన పుట్టుపూరోత్తరాలు చెప్పుకొంటూ తెరవెడలి ప్రవేశిస్తుంది. (ఉదా|| రాజువెడలె రవి తేజమలర). అప్పుడు చోపుదారు తిరిగి ప్రవేశించి రాజుకు కైవారం పఠిస్తాడు. ఆ తరవాత అసలు కధ ప్రారంభమవుతుంది.

దూరంగా కూర్చున్నవారికి సైతము పాట బాగావినిపించేటందుకుగాను పాత్రతోపాటు హంగుదారు కీర్తనలు, పద్యాలు బిగ్గరగా పాడతాడు. అక్కడికీ వినిపించనివారు గ్రహించేందుకు ప్రతిమాట భావము, నలువైపుల తిరుగుతూ హస్తముద్రలతో అభినయించి చూపుతాడు. రాత్రి ఏ పదిగంటలకో ప్రారంభించి సూర్యోదయం వరకు ఆట ఆదుతూనే ఉంటారు.

ఈ ప్రదర్శనాలలో కధకు సంబందించక పోయినా నాయిక పాత్ర ధరింఛే వారిచేత దశావతారాలు, తరంగాలు, శబ్ధాలు పట్టించడం ఒక అచారమయి పోయింది.

ఈ వీధి నాటకాలలో ఇతివృత్తాలు ఎక్కువగా భగవంతునికి సంబందించినవి. అందుకే ఈ వీధి నాటకాలను భాగవతాలని, ప్రదర్శించేవారిని భాగవతులని అంటున్నారు.

వీధినాటకాలలో కొత్తదశ ప్రారంభమయింది. సమకాలీన రాజకీయాలను, సమస్యలను, ప్రముఖ సంఘటనలను ఇతివృత్తంగా తీసుకొని వ్రాసి ప్రదర్శిస్తున్నారు. ఉదా|| సిమ్లా భాగవస్తము, రాజధాని రగడ, స్పుత్నిక్ యాత్ర.

కొరవంజి

కొరవంజి అనగా కొరవ జాతిస్త్రీ - ఎరుకల నాట్యవిసేషము కొరవంజి అన్న పేరుతో దృశ్యరూపకమయింది.

'కొరవంజి పాత్ర ప్రవేశముగల యక్షగానాలకు కొరవంజులని పేరు ' అని కొందరు విమర్శకులు, కొరవంజి పరిణామమే యక్షగానమని మరి కొంద్రు పరిశోధకులు అభిప్రాయ పడుతున్నారు.

వీధి నాటకాలలొవలె కొరవంజులలో కూడ పాత్ర ప్రవేశికలు, కందాలు, కందార్ధాలు, ద్విపదలు విలసిల్లుతున్నవి.