ఈ పుట ఆమోదించబడ్డది

బుర్రకధ

యక్షగానంలో కధనుస్త్రీయేవినిపించడం పరిపాటి. బుర్రకధలో సామాన్యంగా కధ వినిపిందేది పురుషుడు. ఇతడు తంబురాగాని సితార్గాని పుచ్చుకొని ఆడుతూ పాడుతూ కధ చెప్పతూఉంటే ఇరుపక్కలా ఇద్దరు స్త్రీలు హాస్యము చెప్పేవారు. దీనిని వృత్తిగా స్వీకరించి వ్యాప్తిలోకె తెచ్చినది జంగాలు. వీరు ఉరూరా తిరుగుతూ వీధి మొగలలో ప్రధర్శనాలు ఇచ్చేవారు. ఇప్పుడు కులంతో నిమిత్తం లేకుండా స్త్రీ పురుషులు, బాలబాలికలు బుర్రకధలుచెప్పుతూ ప్రజలను రంజింప జేస్తున్నారు.

మొన్నమొన్నటివరకు బుర్రకధలను మంజరీ ద్విపరలో రచింఛేవారు. ఇప్పుడు ద్విపదలే గాక కీర్తనలు, దరువులు, కందార్ధాలు వాడుతున్నారు. వీరు పాట చివర "తందానరాన, తానిదందాన" అనిగాని, "వినరా భారత వీరకుమారా! విజయం మనదేరా" అనిగాని వంత పాడతారు; స్వరముక్తాయింపులు ఇస్తారు. బుర్రకధ దేశ సాహితీశాఖకు చెందినది. ఇది చక్కటి జాను తెలుగులో రచింపబడి, ప్రేక్షకులను తొందరగా ఆకర్షించి, రసానుభూతి కలిగించడంలో ప్రముఖస్థానము వహిస్తున్నది. వీటిలో ఎక్కువ ప్రాధాన్యమునువహించేవి వీర, కరుణ రసాలు. ఈ విధమైన ద్విపద బుర్రకధలలో చెప్పుకోదగ్గవి-పల్నాటి వెరచరిత్ర, బొబ్బిలికధ, బాలనాగమ్మకధ, రామమ్మకధ, ఆరుగురు మరాఠీలకధ.

15, 20, సంవత్సరాలకితం వరకు బుర్రకధల ఇత్ వృత్తాలు పురాణ సంబంధమైనవి, జానపద సంబంధమైనవి అయినవి ఉండేవి. నేడు సమకాలీన ప్రజాసమస్యలను, రాజకీయాలను, మహాపురుషుల జీవితగాధలను ఇతివృత్తాలుగా తీసికొని బుర్ర కధలు వ్రాస్తున్నారు. వీటికి ఆధ్యులు సుంకర సత్యనారాయణగారు. వీరు రచించిన కష్టజీవి, అల్లూరి సీతారామరాజు, వేరేశలింగం ఈ కోవకు చెందిన బుర్రకధలు.

బుర్రకధ ఆరు బయలు ప్రదర్శన, సామాన్యంగా కధకుడు తురాయి పాగా పెట్టుకొని, పొడుగుపాటి అంగీతొడిగి, కాళ్ళకు గజ్జెలు కట్టుకొని, ఆడుతూ పాడుతూ కధవినిపిస్తాడు. వంతపాడేవారు మామూలు దుస్తులు వెసుకొని, విభూత్ బొట్లు పెట్టుకొంటారు. ఈ వంత పాడేది ఇప్పుడు ఎక్కువగా పురుషులే. పూర్వము కొంత హాస్యము మాత్రమే చెప్పేవారు. ఇప్పుడు హాస్యంతోపాటు రాజకీయాలు చెప్పటంకూడా పరిపాటి అయింది.