ఈ పుట ఆమోదించబడ్డది

అంకరంగ విభజ

సంస్కృతాంగ్ల రూపకాలలో సామాన్యంగా 5 దశలు లేదా అవస్థలు కనిపిస్తాయి. వీటినే మనవారు ప్రారంభము, ప్రయత్నము, ప్రాస్త్యాశ, నియతాప్రి, ఫలాగమము అన్నారు. ఈ ఐదు విభాగాలుగా లేదా ఐదు అంకాలుగా రూపకాన్ని విబజించడంఆచారమయినది. ఒక అవస్థ లేదా దశ పూర్తిఅయిన తరవాత కాలవిలంబమున్నప్పుడుకాని, స్థలము మార్పు జరిగినప్పుడుగాని అక్కడ రూపకాన్ని విచ్చేదించడం, ఆ విభాగానికి అంకమని పేరు పెట్టడం పరిపాటి. ఒక్కొక్క అవస్థను ఒక్కొక్క్జ అంకంలో విబంధిస్తే ఐదు అంకాలవుతాయి. ఒక్కొక్క అవస్థను రెండేసి అంకాలలో నిబందించి 6,8,10 అంకాలవరకు రూపకాన్ని పొడిగించవచ్చు. ఇంగ్లీషు రూపకాలలో ఈ అంక విభజన ప్రాతిపదిక స్పష్టంగా గోచరిస్తుంది. సంస్కృత నాటకాలలో అంకాన్ని రంగాలుగా విభజించవలెనని లాక్షణీకులు చెప్పకపోయినా ఆచరణలో రంగవిభజన కనిపిస్తుంది. శాకుంతలం ప్రధమాంకము నిజానికి రెండు రంగాలు- అరణ్య ప్రాంతమొకరంగముల్, కణ్వాశ్రమోద్యానవనము రెండవరంగము. ఇట్లానే విష్కంభ ప్రవేశదారులను ప్రత్యేక రంగాలుగా పరిగణింపవలసి ఉంటుంది.

ఆధునిక నాటకాలలో మూడుదశలు కనిపిస్తున్నవి. ప్రారంభము, పరాకాష్ట, ముగింపు. ఈ మొడు దశలను అనుసరించి నేడు సామాన్యంగా మూడు అంకాలలో నాటకము నడుపుతున్నారు. మరీ ఇటీవల అంక, రంగ విబజన లేకుండా ఒకేఒక అంకంలో ఒకేఒక స్థలకంలో ధారావాహికంగా నాటకాలు నిర్వహిస్తున్నారు.

అంకాలుగా, రంగాలుగా విచ్చేదంలేకుండా ఒకేఓక అంకంతో ధారావాహికంగా రూపకాన్ని నిర్వహిస్తే ప్రేక్షకుల మనస్సుకూడ విచ్చిత్తిలేకుండా ప్రదర్శనమీద లగ్నమవుతుంది. అప్పుడు రసాస్వాదన అవిచ్చన్నంగా సాగుతుంది, అట్లాగాక కధనుబట్టి విచ్చేదము తప్పనిసరి అయితే రూపకంలో ఒక సన్నివేశము లేదా ఒకదశ పూర్తి అయిన తరవాత, కాలంమార్పో, స్థలంమార్పో ప్రాతిపదికగా అంకవిభజన చేయవలసిఉంటుంది. రంగవిభజన సాధ్యమైన్ంత వరకు పరిహరించడం మంచిది, రూపక భాగాలు చిన్నవై సంఖ్య పెరిగినకొద్దీ ప్రేక్షకుల ఏకాగ్రత తగ్గిపోవచ్చు.