రాజకీయ వ్యంగ్యము
స్థలంమీద చూసిన విషయమే! ఇక్కడ ప్రేక్షకుల జ్ఞానానికి, దుష్టబుద్ధి యొక్క భావనకు విపర్యయము సంభవించిండి.
ఒక పాత్ర రంగస్థలంమీద మారువేషంలొ వ్యవరిస్తూఉంటుంది, అది మారువేషమని, అసలు వ్యక్తి ఫలానా అని ప్రెక్షకులకు తెలిసి ఉంటుంది. కాని రంగస్థలం మీది పాత్రలన్నింటికో, కొన్నింటికో అసలు విషయము తెలియదు. అప్పుడు వారిచర్యలు, సంభాషణలు వింతగా ఉంటాయి. ఈరకమైన సన్నివేశవ్యంగ్యము షేక్సిపియర్ ట్వెల్త్ నైట్ (Twelfth Night), మార్చంట్ ఆఫ్ వెనిస్ (Merchant of Venice), యాజ్ యు లైక్ ఇట్ (As You Like It) వంటి రూపకాలలో ఎక్కువగా కనిపిస్తుంది.
ప్రతాపరుద్రీయంలోని పిచ్చివాని రంగాలు సన్నివేశా వ్యంగ్యానికి తార్కాణాలు. పిచ్చివాడు యుగంధరుడేఅని ప్రేక్షకులకుతెలుసు. రంగస్థలంమెద ఇతర పాత్రలళొ కొన్నింటికి తెలియదు. పిచ్చివానిసంగతి తెలుసుకోవాడానికి ఇతర పాత్రలలో కొన్నింటికి తెలియదు. పిచ్చివానిసంగరి తెలుసుకోవడానికి వెంటాడిన దారులు అతని గుట్టు తెలుసుకొలేక "అల్లా! అల్లా! అల్లా! అరే! వీడు దీవానా, నిశ్చయం, (అని దుమికి) మనమేదుకు వీదితో చావడం! పోదాం రారా!" అంటుంటే వారి అజ్ఞానానికి, యుగంధరుని తెలుసుకోలేని అసమర్ధతకు ప్రేక్షకులు నవ్వుకొంటారు.
సుభద్రార్జునీయంలో సన్యాసి వేషంలొ ఉన్నది అర్జునుడని ప్రేక్షకులకు తెలుసు. సుభద్రకు మాత్రము తెలియదు. అర్జునుడు తన ఎదుట ఉన్నాడని గ్రహించలేక సుభద్ర తనలో 'పార్ధుడు వచ్చునో రాడో!" అనుకొంటుంది. ఆ తరవాత
నేనెక్కడ నరుడెక్కడ
ఈ నా సంతాపము నతడెఋగ తలండా
దీనాయతి వేడేదమిము
మౌనీశ్వర మీరనన్ను మనుపగవలయున్1
ఇట్లాంటి సన్నివేశవ్యంగ్యము ధర్మవరం రామకృష్ణమాచార్యులుగారి ప్రమీలర్జునీయంలో కూడా కనిపిస్తుంది.
1---ధర్మవరం గోపాలాచార్యులుగారి "కిరాతార్జునీయము" చరుర్ధాంకము, పుట.54