ఈ పుట ఆమోదించబడ్డది

విపర్యయము

హఠాత్తుగా అపవాదు రాముని చెవిసోకి సీతాపరిత్యాగమనే కష్టంతో అంకము సమాప్తమవుతుంది. హరిశ్చంద్రలో మృగయావినోదము, విశ్రాంతి, మాతంగ కన్యల ఆటపాటలు ఇట్లా ఆనందంగా అర్ధభారము గడిచిన తృతీయాంకము అటుతరవాత విశ్వామిత్రుని కోపాగ్ని ప్రజ్వలనంతో, హరిశ్చంద్రుని రాజ్యభ్రష్టతా కష్టంతో అంతమవుతుంది. మధ్యస్థానానికి చారుదత్తుని తీసుకొని వెళ్ళే కష్టంతో ప్రారంభమైన మృచ్చకటికలకధ దశమాంకంతో శుభప్రదంగ ముగుస్తుంది.

గంభీరంగా ఉండే ఘట్టాల మధ్య తేలికరంగాలు, హాస్యరంగాలు కూర్చడం యాజ్ యు లైక్ ఇట్, స్వప్నవాసవదత్త, రోషనార నాటకాలలో కనిపిస్తుంది.

పాత్రవిపర్యంతము: రెండు పరస్పర విరుద్ధశక్తుల మధ్య సంఘర్షణ జరుగుతూఉంటుంది. కాబట్టి ఆశక్తులకు ప్రతీకలయిన పాత్రలుకూడ పరస్పర విరుద్దాలుగానే ఉంటాయి. అందుచేత ఈ వైరుధ్యంకూడ అంతర్గత మయినదే!

ఉదా|| అమాయకుడైన ఒధెల్లొకు ప్రతిపక్షాన మాలయమారి ఇయాగో, ఏకపత్నీవ్రతుడైన రామునికి ప్రతి పక్షంలో స్త్రీలోలుడైన రావడుడు.

సంఘటనా విపర్యయము ఒక పాత్రకు బాగా ప్రణాశింపజేయడానికి వెలుగునీడల సిద్ధాంతా సరంగా, దానికి విరుద్ధమైన్ పాత్రను సృష్టించడం జరుగుతుంది. సాధుశీల అయిన చంద్రమతికి విరుద్ధంగా గయ్యాళిగంప కాలకంఠి; పతినిపూజించే సావిత్రికి విరుద్ధంగా భర్తను కొట్టే మల్లిక ఇందుకు ఉదాహరణలు.

ఒకే నాటకంలో పరస్పర విరుద్ధమైన సంఘటనలు సృష్టించడం సంఘటనా విపర్యయమవుతుంది. "యాజ్ యు లైక్ ఇత్" (As You Like It) లో ఏలియా తన సోదరిని విడిచిపెట్టలేక ఆమెతో అరణ్యవాసానికి వెళ్ళడం: దీనికి విరుద్ధంగా అత్లెండాను అన్న ఇంటినుంచి వెడలగొట్టడం ఇందుకు ఉదాహరణలు.

మృచ్చకటిక ప్రధమాంకంలో చారుదత్తుడు వసంతసేనను శకారుని బారినుంచి రక్షించడం; ఆతరవాత శకారుడు వసంతసేనను గొంతునులుమడం అనేవికూడా ఇందుకు చక్కని ఉదాహరణలే.