ఈ పుట ఆమోదించబడ్డది

ఇక, చింతామణి చూడండి--

లజ్జకుం గారణంబైన లంజవృత్తి
మానుడీ భూషణము స్త్రీకి మానమే నుడి.1

విపర్యము (Contrast)

రూపకానికి సౌష్టవము, రమణీయత, బలము చేకూర్చడంలో సాదృశ్యం కంటె విపర్యయము (వైరుధ్యము) ఎక్కువ శక్తిమంతమైనది. పరస్పరవిరుద్ధాలైన కధలము, పాత్రలను, సంఘటనలను రూపకంలో చూపించి ఏదోఒక ప్రయోజనాన్ని సాధించే విధానాన్ని విపర్యవిధాన మంటారు.

సామాన్యంగా ధర్మము అధర్మము వంటి రెండు విరుద్ధశక్తుల మధ్యనే సంఘర్షణ జరుగుతుంది. కాబట్టి విపర్యయము ఇతివృత్తంలోనే అంతర్గతమై ఉంటుంది మంచిచెడ్డలు, కష్టసుఖాలు వంటి విపర్యాయాలు రూపకంలో సహజంగా చిత్రితమవుతాయి. రూపకంలో ప్రారంభ - ప్రయత్నాలకు, నియతాప్తి - ఫలసిద్దులకు విపర్యయము గోచరిస్తుంది. రూపకము ఉల్లాసంతో, సంతోషంతొ ప్రారంభమై అష్టకష్టాలతో అంతముకావచ్చు. ఒథెల్లో రూపకము బకెల్లో. ద్దెసెమూనాల ప్రేమోదంతంలో, ఉల్లాసంతో ప్రారంభమైయ్యే సారంగధర రూపకము విషాదాంతకంగా పరిణమిస్తుంది. శాకుంతల, ఉత్తరరామచరిత రూపకాలు ఉల్లాసరంగాలలో ప్రారంభమై క్రమంగా కష్టాలతోనిండి ఆఖరిక్షణంలోశుఖాంతంగా మారినవి. రూపకప్రారంభంలో ఉల్లాస, సౌఖ్యాలు రూపకాంకంలో కష్టాలు-ఇవి సుఖదు:ఖాల విపర్యయానికి ఉదాహరణలు. ప్రారంభంలో కష్టాలు, అంతంలో సుఖాలు- ఇట్టి విపర్యయంకూడా కొన్ని రూపకాలలో కానవస్తుంది. కష్టాలలో ప్రారంభమైన యాజ్ యు లైక్ ఇట్ (As You Like It) రూపకము సుఖాంతమవుతుంది. అట్లాగే కష్టాలతో ప్ర్రారంభమైన ప్రతాపరుద్రీయము, మృచ్చకటిక్ సుఖాంతమవుతాయి. ఇవి కష్టసుఖాల విపర్యయానికి ఉదాహరణము.

ఇకే అంకంలో కష్టసుఖాలో, సుఖకష్టాలో క్రమంల్ల్ల్ల్గా రావడంకద్దు. ఉత్తరరామ చరిత ప్రధమాంకము కొంతవరకు ఉల్లాసంగా నడుస్తుంది. కాని


1.జువ్వాది నారాయణరావుగారి "చింతామణి" దశమాంకము పుట.10