ఈ పుట అచ్చుదిద్దబడ్డది

యర్మిలి వర్ణాశ్రమాచారవిహిత - ధర్మంబు లరయుదె తడఁబడకుండఁ?
జోరులవజారుల సుడియంగనీక - వారల దండింతె వదలక పట్టి?
చతురంగబలముల సన్నాహపటిమ - నతియుక్తిఁ జూతువె యప్పటప్పటికి?1590
ధనధాన్యవస్తుసద్భటసమేతముగ - మునుపుగాఁ గడిదుర్గముల నుంచినావె?
యన్యాయములు సేసి యర్థముల్ గొనక - మాన్యతఁ బ్రోతువె మఱికాపుజనుల7
నర్థలోభమున విప్రాగ్రహారములు - నర్థ మెత్తవు గదా యరవీస మైన?
నెపుడు గోబ్రాహ్మణహితము గోరుచును - నిపుణుండవై ధర్మనిష్ఠ నుండుదువె
శక్తిత్రయంబును షడ్గుణంబులును - శక్తిపంచాంగముల్ చతురుపాయములు
పదునాల్గురాజపాపంబులు దెలిసి - సదయుఁడై మనుధర్మశాస్త్రసంగతిని
దేవతాపితృమహీదేవతాపూజ - గావించి స్వర్గంబుఁ గాంచు భూవిభుఁడు
నీవును నారీతి నీతి రాజ్యంబు - గావింతువే" యంచు కాకుత్స్థుఁ డడుగఁ
గరములు మొగిచి గద్గదకంఠుఁ డగుచు - భరతుండు రామభూపతి కిట్టు లనియె
“నీధర్మసరణి నా కేదియుఁ దెలియ - దోధర్మనిపుణ యింకొకవార్త వినుము1600
నృపకులాధీశ్వర! నిన్నుఁ గానలకుఁ - గృపమాలి పిలిచి కైకేయి పొమ్మనినఁ
దడయక మీ రిటు తాపసవృత్తి - నడవికి విచ్చేయ నది యాది గాఁగ,

దశరథునిమృతిని భరతుఁడు తెల్పుట

నలతలఁ దూలి యేడవనాఁడు మిమ్ముఁ - దలఁచుచు మృతుఁడయ్యె దశరథేశ్వరుఁడు
ఏనును పితృమేథ మెల్లను జేసి - కానల మీరుండఁ గానవచ్చితిని."
అనుపల్కు నిర్ఘాత మై వచ్చి రామ - జనపతి మూర్ఛిల్లి జగతిపై వ్రాలె;
మేదినీసుతయు సౌమిత్రియుఁ దూలి - మేదిని వ్రాలిరి మృతు లైనపగిది,
నొలసినధృతి రాముఁ డొక్కింతఁ దెలిసి - పలుమాఱు విలపింప భరతుఁ డిట్లనియెఁ
"గృతమతి వయ్యుఁ బ్రాకృతునిచందమున - నతిశోకమును బొంద నగునయ్య నీకు?
దేవ లక్ష్మణుఁడు వైదేహియు మీరు - వేవేగ దశరథోర్వీనాథమణికిఁ
బరలోకవిధు లెల్ల భక్తితోఁ జేయుఁ - డరయంగ నది యుక్త" మనిన రాఘవుఁడు610
మందాకినికి వచ్చి మది నిష్ఠ వెలయ- నందుఁ గృతస్నానుఁ డై తండ్రి కపుడు
మొనసి తిలోదకములు వోసి వగలు - పెనఁగొన మఱి గారపిండిచే బుణ్య
ధనుఁ డర్థిఁ బిండప్రదానము ల్చేసి - ఘనతరశోకసంకలితుఁ డై మగుడి
సన్నుతగతిఁ బర్ణశాల కేతెంచి - యున్నచో రఘురాముఁ డున్నసన్నిధికిఁ
బౌరవర్గముతోడ బంధులతోడఁ - జారువర్తనులైన సచివులతోడ
ఘనుఁడు వసిష్ఠుండు కౌసల్య మొదలు - జననులఁ దోడ్కొని చనుదెంచుటయును
నూనినశోకాగ్ను లొలుక రాఘవుఁడు - తాను సీతయు సుమిత్రాతనూజుండు
వారియంఘ్రులమీఁద వ్రాలి శోకింప - వారును శోకింప వారించె నంత