పుట:Ramanujan Nundi Etu Atu by Vemuri Venkateswararao.pdf/77

ఈ పుట అచ్చుదిద్దబడ్డది
x n (x) లెజాండర్ లెక్కలో దోషం గౌస్ లెక్కలో దోషం రీమాన్ లెక్కలో దోషం
10 4 0 2 -
102 25 -3 5 1
103 168 -23 10 0
106 78498 -6116 130 29
109 50847534 -2592592 1701 -79

10.2 రీమాన్ జీటా ప్రమేయం

ఇప్పుడు మళ్లా మన ప్రమేయం అనే పెట్టె వద్దకి వద్దాం. సర్వసాధారణంగా పెట్టె లోపల ఏమి జరుగుతోందో చెప్పడానికి ఒక సమీకరణం వాడతారు. ఉదాహరణకి f(x) = x2 అని చెప్పేమనుకుందాం. దీని అర్థం ఏమిటంటే పెట్టెలోకి x ని పంపితే, పెట్టె x2 ని బయటకి వెలిగక్కుతుంది. ఇంకా వివరంగా చెప్పాలంటే x = 1 అయితే పెట్టె బయటకి 12 = 1 వస్తుంది, x = 2 అయితే పెట్టె బయటకి 22 = 4 వస్తుంది, x = 3 అయితే పెట్టె బయటకి 32 = 9 వస్తుంది. పెట్టె లోపలికి నిజ సంఖ్యలే వెళ్లనక్కర లేదు; కల్పన సంఖ్యలు (imaginary numbers) కూడ వెళ్ల వచ్చు; x = i అయితే పెట్టె బయటకి i2 = -1 వస్తుంది.

రీమాన్ తన అలవాటు ప్రకారం తను వాడిన ప్రమేయానికి “జీటా” ʅ (s) అని పేరు పెట్టేరు. ఇక్కడ s అనేది జంట సంఖ్య (complex number) ని సూచిస్తుంది. కనుక ఈ జీటా ఫంక్షన్ అనే పెట్టె లోకి a + bi అనే జంట సంఖ్యని పంపితే బయటకి c + di అనే మరొక జంట సంఖ్య వస్తుంది. కొద్ది సేపట్లో రీమాన్ పేరు మీదుగా ఉన్న ఈ “జీటా ఫంక్షన్” రూపం రాసి చూపెడతాను.