పుట:Rajasekhara Charitramu - Kandukuri Veeresalingam.pdf/134

ఈ పుట ఆమోదించబడ్డది

గతులను దెలిపికొని విచారపడి,రాజబంధుఁడును కారాగృహాధికారియు నైన శోభనాద్రిరాజుగారిని చూడుడని బోధించిరి. భీమవరమును చేరియే శ్యామలకోట యని యొక దుర్గముండెను. దానిలో శ్యామ లాంబ గుడి యుండెను కాఁబట్టి దాని కాపేరు కలిగియుండెను. అది యా కాలములో పెద్దాపుర రాజుగారియొక్క రాజ్యములలో నేరము చేసినవారి నుంచు చెఱసాలగా నుపయోగపడుచుండెను. ఇప్పుడా కోట పడిపోయినందున, అదియుండు స్థానమున నొక్క- గ్రామము కట్ట బడియున్నది; దానికి చామర్లకోట యని పేరు. ఆ కోట కధికారిగా నున్న శోభనాద్రిరాజుగారి కొక గ్రామముకూడ నుండెను.

రాజశేఖరుఁడుగా రాగ్రామములో కాపురమున్న కాలమందు రామరాజప్పుడప్పుడు రాత్రులు వచ్చి చూచిపోవుచుండెను.ధనము క్రమ క్రమముగా తఱిగిపోవుటను చింతించి, మాణిక్యాంబ ప్రతిదినము శోభ నాద్రిరాజుగారిని జూచి యుద్యోగము నిమిత్తమయి ప్రయత్నము చేయవలసినదని బలవంత పెట్టుచుండెను. అతఁడు రెండు మూడు సారులు పోయి సమయమయినది కాదని మరల వచ్చుచుండెను. కడ పటిసారి రాజశేఖరుఁడుగారు శోభనాద్రిరాజుగారి దర్శనార్థము వెళ్ళి వచ్చినప్పడు దంపతుల కిరువురకును యీ ప్రకారముగా సంభాషణ జరిగెను:

మాణి__మీకు రాజుగారి దర్శనమయినదా?

రాజ__ఆయినది. నేను వీధి గుమ్మములో నిలుచుండి యక్కడనున్న యొక పరిచారకుని జూచి లోపలికి వెళ్ళవచ్చునా యని యడిగితిని. భాగ్యవంతుఁడయిన పక్షమునఁ దిన్నగా లోపలికి వెళ్ళవచ్చుననియు, బీదవాఁడవైన యెడల నిక్కడనే నిలుచుండవలసిన దనియు వాఁడు చెప్పెను. నేను గొంచెముసే పాలోచించి చొరవ చేసి రాజుగారున్నచోటికిఁ బోయి నిలువఁబడితిని.

మాణి__రాజుగారితో మాటాడి మీ సంగతు లన్నియు చక్కగా మనివి చేసినారా?

రాజ__నేను గదిలోనికి వెళ్ళి నా స్థితిగతులను జెప్పు కొన్నాను, ఎవరితోనందు వేమో, రాజుగారితోఁగాదు__ఎందుచేతనన్న