ఈ పుట అచ్చుదిద్దబడ్డది

80

రాజస్థానకధావళి,


లగు రాజపుత్ర సంస్థానములు సంగుని యాజ్ఞను శిరసావహించుచు వచ్చెను. మాళవ దేశము మొదలు ఆబూయను పర్వత శిఖరమువఱకు నతఁడేక ఛత్రాధిపత్యము వహించెను. రాజ్యమారంభించిన వెనుక నాతఁడు పదునెనిమిది చిన్నచిన్న యుద్ధములు ఢిల్లీ చక్రవతి౯ తోను మాళవరాజుతోను జేసి గెలుపు చేకొనుచు వచ్చెను. ఢిల్లీ చక్రవతి౯ ని యొకమారు గాక యనేకమారులు గెలిచెను, మీవారు. రాజ్యము యొక్క సరిహద్దు లన్నిపక్కలను పెరిగెను. ఉత్తరపుటెల్ల బయానా యను కోటవద్దనున్న పసుపుటేరు వఱకు వ్యాపించెను. సంగుఁడు మీవారు రాణాలో నెల్ల నగ్రగణ్యుఁ దగుట కొక కథ కలదు.

ఒకమారు దేవతలలో నొకఁడు మనుష్యావతార మెత్తి తన పూర్వశత్రువగు నౌక మనుష్యునిమీఁద పగదీర్చుకొనుటకు భూమి మీఁదకు వచ్చి తిరుగుచు చిత్తూరునకు వచ్చెనఁట. సంగుఁడు వానిని చూడఁగనే యతఁడు మహాపురుషుఁడని గ్రహించి యాచరించి గౌరవించెనఁట, ఆదివ్యుఁడు 'సెలవుపుచ్చుకొని పోవునప్పుడు పటుత్వముగల యొక రక్షరేఖ నొక సంచిలోఁ బెట్టి సంగున కిచ్చి దానిని 'మెడలో గట్టుకొమ్మనియు నది మెడలో సున్నంత కాలము వానికి జయము గలుగుననియు నదిపొరబాటునగాని దైవవశమునఁగాని వీపు మీఁదకుఁ దిరిగిన పక్షమున వానికి చెడ్డదినములు వచ్చినవని నమ్మవలసినదనియు దృఢముగాఁ జెప్పినఁట, తనమాట నిశ్చయమని ఋజువు చేసికోను టకు దివ్యపురుషుఁడు సంగునకు నెమిలియీఁక నిచ్చి "దీనిని దీసికొని పోయి మీనగరమునందుఁ మృతినొందిన వారి నందఱి దీనితో స్పృశి యింపుము. వా రందఱు మరల బ్రతుకుదు" రని పలికెను. ఆమాట చొప్పున రాణా చిత్తూరునకువచ్చి కనఁబడిన ప్రతిశవమున కానెమలి యీఁకను దగిలింప నామృతకళేబరము ప్రాణవంతమై లేచి నిలుచుచు వచ్చి. అంతట దేవునిమాటలు నిజమనినమ్మి సంగుఁ డాదివ్య పురు