ఈ పుట అచ్చుదిద్దబడ్డది

74

రాజస్థానకథావళీ.


మానంబు నిలువక పుచ్చుకొని మాగ౯మధ్యమున వానిని భక్షించెను. 'భక్షించి కొంత దవ్వరుగునప్పటికి వానిగుండెలు బరువెక్కెను. నోట మాట రాదయ్యెను గుఱ్ఱము పైఁ గూరుచుండ లేక పోయెను. అతఁ డప్పటికి దనతోటకు కొంతదూరములోనున్న మామాదేవి యాలయమువద్దకు వచ్చె, అక్కడనుండి యొకయడుగైన గదల లేక యతఁడు కడసారి తనప్రియురాలిని గనుంగొనఁగోరి తారాదేవి నచ్చటికి రమ్మని వత౯మాన మంపెను; కాని యాదేవి వచ్చు లోపలనే తనకు బ్రియనిదానంబైనయాకోటపై దృష్టి నిలిపి చూచుచు సిరోహి రాజు చేసిన విషప్రయోగముకతంబున ప్రాణంబుల విడిచె.

అనంతరము తారాదేవి యచ్చటకు వచ్చి భతక౯కళేబరమును గాంచి విలపించి వీరపుత్రికయు వీరపత్నియు నగుటం జేసి పతివ్రతల మాగ౯ మనుసరింపనిశ్చయించి భత౯కు జితిపజఱిపించి నిర్విచారముగ స్వయంవరమునకరుగు కన్యక వోలె చిచ్చురికి తన భతక౯తో గూడ పరమపద మొందెను. ఇప్పటి కాదంపతులు గతించి రమారమి నాలుగువందల సంవత్సరము లైనను మామాదేవిగుకి వద్ద 'నేటికిని తద్దంపతులు తమ దేహములు నగ్నిహోత్రున కాహుతి చేసిన స్థలము గనఁబడుచుండునఁట. పృథివిరాజు తన చేసిన యుద్ధము లన్నిఁటియందు జయము కపటోపాయములచే నోందినను మొత్తముమీద నతఁడధిక సాహసుం డనియు రణమున వెనుకంజ యిడని వాఁడనియు పిఱికి కండ లేనివాఁ డనియు జెప్పవచ్చును.

అన్నను జంపి తాను చిత్తూరు సింహాసన మెక్కఁ దలంచుట యీతనియం దొక గొప్పలోపమే యనవచ్చును. ఈతఁడు గాక రాజవుత్రులలో మిక్కిలి ప్రసిద్ధి కెక్కిన పృధివిరా జింకొకఁడు కలఁడు. అతఁడు చోహణవంశస్థుఁడు. ఢిల్లీ చక్రవర్తి. అతఁడే మహమ్మదుగోరీ యను మ్లేచ్ఛరాజును మొట్టమొదట జయించి మరల నా మ్లేచ్ఛుఁడు కన్యాకుబ్జభూపాలుఁ డగుజయచంద్రుని గలిసి యెత్తివచ్చినప్పుడు