ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పృథివిరాజు సాహసములు.

67


గలిగేగదా యని సంతసించి మఱల కమలమియరుకోటకుం జనియె ఇట్టిశూరకర్మల పృథివిరా జవలీలగా ననాయాసముగఁ జేయు చుండును గాని వానికై పెద్ద ప్రయత్నముఁ జేయ నక్కర లేదు.

పృథివిరాజు కమలమీయరుకోటకుఁ బోయి కొన్ని దినము లుండునప్పటికి వాని పినతండ్రి యగు సురేశమల్లుఁడు రాణా పై తిరుగబాటు చేసి యుద్దమునకు సిద్ధమయ్యెను. పూర్వము చారుణీ దేవి యర్చకురాలు తనకు ప్రభుత్వము రాజ్యము వచ్చునని చెప్పినమాట మనసులో నుంచుకొని సురేశమల్లుఁ డది యెత కాలమునకు సఫలము కాదయ్యెనని వగచి సాహసేలక్ష్మీ! యనుమాట నమ్మి భుజబలము చేత రాజ్యము సంపాదింపఁదలఁచి తనసోదరుఁడును మహారాణాయు నగురాయమల్లు నిమీఁద గత్తి కట్టెను. రాణాకు మున్ను మిక్కిలి నమ్మకము గలవాఁడును దగ్గరచుట్టము నగు సారంగ దేవుఁ డనురాజపుత్రుఁడు రాజద్రోహియై సురేశ మల్లునితోఁ జేరెను. వారిఱువురుం గలిసి మీవారు దేశముం జొచ్చి గ్రామంబుల దోఁచుకొని గృహంబుల పరశురామప్రీతి గావించి కొంత దేశము నాక్రమించిరి. రాయమల్లుఁడు తన సైన్యములం గూర్చుకొని వారిపై నడచి యెదుక్కొని సంకుల సమరము గావించి తాను నొక్క సామాన్యపుజోదువలె పోరి యిరువది రెండుగాయములఁ దిని యేమియుం జేయలేక యుండెను. అప్పుడు రాయమల్లుని సైన్యము పగతురచేత నిర్మూలింపఁబడుటకు సిద్ధముగ నుండెను. అంతలో పృథివిరాజు వచ్చి తండ్రి సేన నిర్మూలింపఁబడ కుండఁ గాపాడెను; కాని శత్రువులను పరాజయము నొందింప లేదు.

ఉభయుల సేనలు నొండొంటికి తీసిపోక వెనుకంజ యిడక చావునకు వెరువక రాత్రులా యుధములమీదనే బవ్వళించుచు నెప్పుడు తెల్లవారు నెప్పుడు పోరు సేయఁ గలుగునని యువ్విళులూరుచు దినములం బుచ్చుచుండిరి. అట్లుండ నొకనాఁడు రాత్రి సురేశ మల్లుఁడు మంచము పై బండుకోని ప్రణవైద్యుఁ డగునోకమంగలివానిచే