ఈ పుట అచ్చుదిద్దబడ్డది

60

రాజస్థానికధావళి.


మఱలఁ దనతండ్రి కర్పింపవలయు నని నిశ్చయించుకోని యేదేని యుపాయము దొరకకపోవునా యని ముఖ్య పట్టణమునకుఁ బోయెను. ఇంతలో నతనివద్దనున్న దవ్యమంతయు వ్యయ మయ్యెను, అతని యనుచరు లతనికన్న నిరుపేదలై యుండిరి. తన యనుచరులకుం దనకు నొకపూట బసయు నన్నమును సమకూర్చుకోనుటకుఁ దన వ్రేలనున్న వజ్రపు టుంగరము గొదువ బెట్టుటఁ దప్ప గత్యంతరము కానఁ బడదయ్యె. అతఁ డాయుంగరమును దీసికోని.బోయి ఓజుఁ డనునొక వత౯ కునికిఁ జూపి దానిమీఁది కోంతసోమ్మడి గెను. దైవవశమున నావత౯కుఁడు మును పాయుంగరమును పృధివి రాజున కమ్మిన యతఁడే యయ్యెను. ఆవణీజుఁ డాయుంగరమును, 'రాజకుమారుని గుర్తు పట్టి తవ్వత్తాంతము వినఁగోర పృధివి రాజు తనసంకల్పమును మర్మము విడిచి యతనితో జెప్పెను. అది విని వతకాకుండు సంత సించి యుపాయము చే గద్వారు దేశము ననాయాసముగ గెలువవచ్చునని యతనికి ధైర్యము చెప్పి వానికిం దోడ్పడ నెంచెను.

అనంతరము పృథివి రాజు నేర్పరియగు నోజును యాలోచనము విని మారువేసము వేసికొని యూరుపేరు దెలియనీయక తన యను చరులతో గూడి యచ్చట మీనవంశపు రాజు నోద్ద కొలుపునకుఁ గుదిరి వానికి మిక్కిలి విధేయుఁడై 'భక్తి శ్రద్దలతో బరిచర్య సేయు చుండె. ఇట్లుండ నొకనాడు పండుగ రాఁగా మీన రాజు నమ్మిక గల తనబంట్ల కందఱకు సెలవి చ్చెను. పృధివి రాజును వానికడ సెలవుఁ గైకోని తన యనుచరులను మాత్రము కోటలో రాజువద్ద నిలిపి తాను పండుగ సౌఖ్య మనుభవింపక యూరు బైట చెట్లచాటున దాఁగు కొనెను. అంతలో, గోటలోఁ పృధివిరాజుచే విడువఁబడిన 'సేవకు లైదుగురు పరివారశూన్యుఁడై యొంటిగ నున్న మీనరాజుపయింబడి వానిం దుదముట్టింపఁ దలంప నతఁడు ప్రాణభీతుఁడై గుఱ్ఱము పై నెక్కి కోట వెలువడి యూరుబైట కొండలలో దలఁదాఁచుకోనుటకుఁ