ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రాణా కుంభుఁడు.

55


నిలువ నీడగానక యప్పటి ఢిల్లీ చక్రపతి౯ యగు బహలాల్ లోడి వద్దకు బోయి వాని నాశ్రయించి తన యన్న బారినుండి తన్ను రక్షించి రాజ్య ప్రతిష్ఠితుని జేయు మని బ్రతిమాలి యట్లు చేసినచో మీవారు దేశము ఢిల్లీకి లోఁబడునట్లు చేయునట్లును విశేషించి సూర్యవంశ ప్రదీపకుఁడగు తాను తనకూఁతును జక్రవతి౯ కిచ్చి నిశ్శంకముగా వివాహము చేయునట్లును వాగ్దానము చేసెను, చక్రవతి౯ వాని చెలిమి కిచ్చగించి సాయము చేయుదునని యభయహస్తమిచ్చి వానిని సబహుమానముగ నావలకుఁ బంపె. ఆనాఁడు గొప్ప వాన కురియు చుండెను. పితృదోహి యగుటయేగాక కులద్రోహియు దేశద్రోహి యునై గొరవంబునకు బుట్టినయిల్లగు చిత్తూరు రాజవంశమున జన్మించిన కన్యను గోవును గోపికోని తిను పచ్చితుఱక కిచ్చి వివాహము సేయఁదలంచిన యాదురాత్ముఁడు బతుకఁ గూడదని తలంచి భగవంతుఁడు వాని జంపఁ బంపిన యాయుధమో యనునట్లోక 'పెద్దపిడుగు వచ్చి గుమ్మము దిగఁగానే వాని నడఁచె. పడియున్న యజమానుని కడకు సేవకులు వచ్చి చూచునప్పటికీ నంతయు మాడిన మేనుతో బీనుఁగయై యుండే. మహారాణా కుంభుని యనంతరమున రాజ్యమునకు వచ్చిన యాదుష్టునకుఁ బజలు హంత' యను పేరు పెట్టిరి. హంత యనఁగాఁ జంపినవాఁడని యర్థము. అంతియ కాని వాని నిజమయిన నామ మెవ్వరికిఁ దెలియదు. ఈనృశంసుఁడు విరుగడయి పోయినదే మంచిదని సంతోషించి బ్రజలందఱు రాయమల్లుని తమకు రాణాగా నంగీకరించి వానిఁ గొలుచుచు సుఖించిరి.