ఈ పుట అచ్చుదిద్దబడ్డది

40

రాజస్థానకథావళి.


రెండవ కుమారుఁ డగురఘు దేవుఁడు తనతండ్రి సేవకుల చేతనే వధింపబడెనని యొక్క ఘోరవాత౯ యామెకుం దెలిసెను. అతఁడు మిక్కిలి యోగ్యుఁడగుటచే 'రాణియె గాక రాజస్థానమునందలి జను లంద ఱాబాలగోపాలము వాని యకాలదుర్మరణమునకు విచారించిరి. అతని యందలి భక్తిశ్రద్ధలను సూచించుటకై మివారు దేశ స్త్రీలు వాని ప్రతిమను దమయిండ్ల నిలుపుకొని దానికి మొక్కి పూజించుచు నేటేట నుత్సవములఁ జేయుచువచ్చిరి. సజ్జనుఁడగు రఘుదేవుని గడతేర్చిన రణమల్లుని బంటులే తన కుమారునిఁ గూడ దెగటార్తు రని రాణి మిక్కిలి భయమునందుచు వచ్చెను. అట్టులుండ మీవారు రాజ కుటుంబములో బుట్టి రాణికిం జెలికత్తె యగునొక జవరాలును జూచి రణమల్లుఁడు తన కామెనిచ్చి పెండ్లి చేయు మని కూఁతురును బలవంత పెట్టి దాసినో వెలయాలినో తీసికొనిపోయినట్లు దానిం జేకొనెను. దినదినము నధిక మగుచున్న తండ్రిదుండగముల సహింపలేక రాణి యెట్టకేలకు దిటము తెచ్చుకోని యాసమయమునఁ దనయక్కర గడప గఅశూరుఁడు చండుఁడే యని నిశ్చయించి సత్వరము వచ్చి తనను దనకుమారుని రాజ్యమును రక్షింపుమని వానికి వత౯మాన మంపెను.

ఇది జరిగిన కొన్ని దినములకు వెనుక చండుని వెంటఁ బోయిన వేఁటకాండ్రు కొందఱు మఱలఁ జిత్తూరునకువచ్చిరి. ఏలవచ్చిరని వారిని కొందరడుగఁగా దాము చండునితో నొంటిగఁ జిరకాల ముండలేక విసికి యాలుబిడ్డలఁ జూడవచ్చితి మని వారు చెప్పిరి. వారి నెవ్వరు ననుమానింపక కోటఁ జోరనిచ్చి యెప్పటియట్ల పనులఁ జేయనిచ్చిరి.ఆ సేవకులు వచ్చినది మోదలు రాణి మిక్కిలి దైవభ క్తి గలదై దేవత లకు నుత్సరములు జాతరలు చేయించుచు చుట్టుప్రక్కలనున్న పల్లెలజనంబులకు నిరతాన్నదాన ప్రదానము చేయంపసాగెను. ఆయుత్సవములు జూచుటకు బాలుఁ డగు రాణా తనదాదియుఁ బురోహితుఁడును వెంటరా గుఱ్ఱము నెక్కి తఱుచుగఁ బోవసాగెను. ఈ కార్యము