ఈ పుట అచ్చుదిద్దబడ్డది

38

రాజస్థానకథావళీ,


అతనియెడ గ్రమక్రమముగఁ బ్రజాను రాగ మతిశయించుటచే హంస యోర్వలేనిదై భయమంది తనలో నీవేళ చంకుఁ డల్పుఁడైనా కుమారునకు భృత్యుఁ డైనను ముందుముందు నాకుమారునే యితఁడు. భృత్యునిఁ జేయఁ గలఁడు. ఈ యొదిగియుండుట యెల్ల రాజ్యసంపాదనమునకై చేసెడు నటనగాని, నిజము కాదు. ఇప్పుడు పేరునకు రాజైన యితఁడు ముందు ముందు నిజముగా రాజే యగు" నని తలపోయఁ జొచ్చెను. ఈతలంపు లామె లో నడగి యుండక క్రమక్రమంబున వెలికి వచ్చుటం జేసి చండునకుఁ దెలిసెను. దైవముఖముఁ జూచి తాను సత్యముగా నడచుకొను చున్నను దనయం దామెకట్టి యనుమానము గలిగినందుకు విచారించి యింక నెన్ని చెప్పిన నామె తన్ను నమ్మదని నిశ్చయించి తన యధికార మంతయు వదలుకొని సవతితల్లి యొద్ద సెలవు పుచ్చుకొని చండుఁడు చిత్తూరునగరముఁ బాసి తనకు నమ్మిన బంటులై తన్నెడ బాయంజాలని రెండువందలమందిని వేఁటగాండ్రను వెంటబెట్టుకొని దూర దేశములకుం బోయెను.

చండుఁడు పోయిన తోడనే హంసా దేవి హృదయశల్యమును బాసినట్లు సంతసించి మారువారునుండి తన చుట్టములం బక్కములం బిలిపించి, వాండ్రును గొడ్డు నేలలుగల నూరు వారును విడిచి రత్నగర్భయగు చిత్తూరునకుఁ బోవుటకు మహానందభరితు లయిరి. ఆమెతండ్రి యగు రణమల్లు చిత్తూరునకు వచ్చి యాపట్టణము సర్వసంపన్నముగా నుండుటచే దానిం బాగుఁడలఁపఁడయ్యె. రాణీ సోదరులు దమ కుటుంబములతో వచ్చి చిత్తూరున గాఁపుర ముండి కాలక్రమమున నధికార మంతయు వహించిరి. వారి మాటయే యా దేశమున శాసన మయ్యెను. వారి యాజ్ఞ నిరంకుశ మయ్యెను. వేయేల? వారే రాజులై రి. తరములనుండి మీవారు సంస్థానము గని పెట్టుకొనియున్న యుద్యోగస్థు లందఱు మెల్ల మెల్లఁ దప్పుకోనవలసిన వచ్చె. ప్రజలు సేవకులు జరుగుచున్న దుణ౯యములజూచీ తమలో తారు సణుగుకొను