ఈ పుట అచ్చుదిద్దబడ్డది

36

రాజస్థానకధావళీ,


యంతయు నరసిన 'నేనేమి! పడుచుకన్యను వివాహమాడుట యేమి? ఎవ్వరైన నవ్వరా?"

అనంతర మారాయబారి చండున కావాత౯ విన్నవించి నప్పుడు తండ్రి మోటతనంబు చేసినాఁ డనుకొని కోపలజ్జా భరితుఁడై "ఏమీ తండ్రికి ధర్మపత్నిగా నుద్దేశింపఁ బడినకన్యను నేను వివాహమాడుదునా? వారు నానిమిత్తమే కన్యనుద్దేశించిరేని టెంకాయ నాకాళ్ళమీఁదనే 'మొదట పడవేయరా? కావునఁ దత్ప్రశంస నావద్దఁ దల పెట్టక కాయ మరల మార్వారు దేశమునకుఁ బంపఁదగునని స్వభావసిద్ధ మగు ధైర్యము తోఁ బలికెను.అప్పడు రాణా కొడుకునుం బిలిపించి "నాయనా నామాట వినుము. మనము మిత్రుఁడైన మార్వారు రాజును మన మవమానింపవచ్చునా? రాజపుత్రులు పరాభవమును సహింతురా? ఈయక్కసు మనసునం బెట్టుకొని వారు మన పైఁ బగదీర్చుకొనఁ జూడరా? బాహుబల సంపన్నులగు నతని కొడుకు లూరకుందురా?" యని మందలింపు చండుఁడామాటలు విని "నా కదంతయుఁ దెలియదు. జగము తలకిం దయినను సరే ! ఆమె నాకు తల్లిగాని వేరుగాదు. ఆమాటలు తలఁచుకొనుట మహా పాపము నన్ను కదప వద్దని తండ్రికి చెప్పెను. అప్పుడు రాణా మండి పడి తనయునితో నిట్లనియెను. నీవిత మూర్ఖుఁడవేని నేనే యాకన్యను వివాహ మాడెదనులే కాని యీసంగతి జ్ఞాపకముంచు కొనుము, ఆమెవలన నాకుఁ గలిగిన కుమారుఁడే రాజ్యప్రతిష్ఠు డగును

తండ్రి కోపోద్దీపితుఁ డై నను బంకక చండుఁడు "సరే! మీ యిచ్చవచ్చిన తెఱఁగున జేసికొన వచ్చును. హంసాదేవి కుదయించిన నందనులలో నెవనికి 'రాజ్య మిచ్చినను నాకు సమ్మతమే ఆమెను వివాహమాడి యధర్మకార్యము చేయుటకంటె .రాజ్యము వదలు కొనుట యే యుచిత" మని ప్రత్యుత్తర మిచ్చెను.