ఈ పుట అచ్చుదిద్దబడ్డది

30

రాజస్థానకధావళి.


వుడు నాపడఁతి మెల్లగ నాతని కిట్లనియె. "స్వామీ ! దీని కారణమిది మిమ్ము మావాండ్రు నిష్కారణముగా వంచించినారు. మీ చెట్టబట్టిన యీ సేవకురాలు వితంతువుగాని కన్యగాదు. నేను పసిపాపనై, యున్న నాఁడు మాతండ్రి నాకు వివాహము చేసె. పిదప కొన్ని దినములకే నాభత౯ యుద్ధమున మృతుఁ డయ్యె. ఆయన మోగమైన నాకుజ్ఞాపకము లేదు. ” ఆపలుకులు విని హమీరు తాసు నిశ్చయముగ వంచింపఁ బడియెనని యెఱింగి గాఢవిచార సంతప్తుఁ డయ్యె. హిందూ దేశమున వితంతువును వివాహ మాడునతఁడు మిక్కిలి నీచుడుగ నెంచబడుటచే నతఁడు శోకాకుల చిత్తు డయ్యె. శుభ కార్యములు జరుగునప్పు డెదుట నైనఁ బడ: గూడని వితంతువును పరువుగల సుక్షత్రియుఁడు పెండ్లి యాడుటకన్న హైన్యమింక లోకంబున 'లేదని తలఁచి యతఁడు నాటితో తనయభీమానము కులగౌరవము పెంపు నశించెనని బెంగపెట్టుకొని యేదియుఁ దోఁచక పాన్పుపైఁ బవ్వళించి విచారింపఁజొచ్చె. ఆసమయమున నతఁడా బాలికను కోపావేశమున వధించిన నామె నోరెత్తక యుండియుండును. ఏలయన దుర్భర పరాభవముఁ "దెచ్చు నావివాహము నకు వరుఁ డెంత సిగ్గుపడుచుండునో వధువు 'నంతియ సిగ్గుపడుచుండును. తనజోలికి రాక తన నేమియు నిందింపక తనలోఁ దాను దుస్సహమగు పరివేదన మందుచున్న రాజనందను జూచి యాబాలిక యిట్లనియే. "స్వామి: సేవకురాలను క్షమింపుఁడు. ఇందు నా నేరమేదియు లేదు. మీకింత యవమానము గలిగించిన మీపగతుర పగదీర్చుకొను నుపాయము నేను జెప్పెదను. మీపితృపితామహాజి౯తమగు చిత్తూరు నగరమును మీరు మరల స్వాధీనముఁ జేసికొనవచ్చును." అప్పుడు రాణా శాంతము వహించి యామె చెప్పెడు నుపాయ మేదియో వినఁగోర నామె మరల నిట్లనియె. "మా తండ్రిని మీరు కట్నములు కానుకలు నగలు భూములు నడుగక తనమంత్రియైన జాలుఁడను వాని భరణముగ నిమ్మని యడుగుఁడు. అతఁడు 'మీ కోరికఁ ద్రోసిపుచ్చఁడు,