ఈ పుట అచ్చుదిద్దబడ్డది

24

రాజస్థానకథావళీ,


పునకుఁ దణుముదునా యని రాజకుమారు నడిగెను. ఆమె యేమిచేయునో యాచమత్కారమును జూడవలె నని యతఁడు సరే యట్లు చేయుమనెను. వెంటనే యాయువిద జొన్నకఱ్ఱ నొక దానిని బెరికి చివర పదునుగాఁ జెక్కి మంచె వైపునకుఁ బోయి యొక్క నిమిసములో నాపందినిం బొడిచి చంపి రాజకుమారుఁడుఁ బరివారము నద్భుతపడునట్లు దాని కళేబరమును బర బర యీడ్చి తెచ్చి వారి ముందుఁ బడవైచెను. రాజకుమారుఁడు "వేఁటాపఁదలఁచిన జంతువును మఱియొకరు చంపినచో వారి ప్రాణములు నిలుచుట యరిది. అయినను హరసింగు మాత మా పడుచుపై కోపపడక సొహసమునకు మెచ్చుకొనెను. ఆ బాలిక మరలఁ బొలమునకుఁ బోగా వేఁటకాడ్రు దాఁపుననున్న చిన్న యేటియొడ్డునకుఁ బోయి యన్నముఁ దిని సల్లాపములాడుచుఁ గూర్చుండిరి. అంతలో నొక మట్టియుండ విసవిసవచ్చి రాజపుత్రునిగుఱ్ఱపు కాలికిఁ దగిలెను. గుఱ్ఱము కాలు కుంటుబడెను. అందఱును కోప విస్మయములతో నలుదెసలఁ జూడ వినుకటి బాలిక మంచెపై నిలుచుండి వడిసెలతో రివ్వున రాళ్ళు రువ్వుచు చేనిపై వ్రాలు పిట్టలం దోలుచు వారికన్నుల కగపడెను. ఆమె తన కావించిన తప్పెఱింగి వడివడి రాజనందనుని యొద్దకుఁ బఱ తెచి తన్ను శమింపు మని ప్రార్థిం చెను. అతఁనును బాలిక పైఁ గోపింపక మంచి మాటలం బలికి యామెం బని చెను.

అదినమున వేట ముగించి రాజవుతుఁడు పరివారస మేతుఁడై మందిరమున కరుగుచుండ నాబాలిక నెత్తిమీఁద పాలకుండ తోను నిరు ప్రక్కల మెడకు త్రాడుగట్టిన యొక్కొక మేక పిల్లతోను నడచుచు వారివైపునకు వచ్చుచుండెను. ఆమెను జూచీన తోడనే యాపరివారములో నొకఁడు కొంటెతనమునకు నామెపాలకుండను జారవిడుచునో మేక పిల్లను వదలునో చూడ నభిలషించి యామెను బెదర గొట్టుటకై తనగుఱ్ఱమును యామెవై పునకు దుమికించెను.