ఈ పుట ఆమోదించబడ్డది

పద్మిని.


పూర్వకాలమున మేవారుదేశమునకు వైభవమున సాటిలేని చిత్తూరు నగరము రాజధానియై యుండెను. ఆనగరము చుట్టుపట్ల నలుదెసల బయలగు నేల నొకచదరపు గొండపైఁ గట్టఁబడి దుర్గమములగు కోటగోడలు, నున్నతములగు దేవాలయములు రమ్యములగు మేడలు, మనోహరములగు పూఁదోటలు, శూరులగు రాజకుమారులు గలిగి రాజసంస్థానమున కలంకారమై యుండెను. ఆకొండమీఁదనే వెలసిన యొకదేవత యానగరమును గాపాడుచుండెనని యానాఁటివారు నమ్మియుండిరి. పడుమూడవ శతాబ్దాంతమున మేవారుదేశమునకు లక్ష్మణసింగను నొకబాలుడు రాజయ్యెను. ఆతఁడు రాజ్యభారమును వహించుటకుఁ దగని బాలుఁడగుటచే నాతని పినతండ్రి యగు శూరశిఖామణి భీనుసింగు సంరక్షకుఁడై రాజ్యతంత్రమును నిర్వహించుచుండెను. భీమసింగు సింహళద్వీపరాజపుత్రియు నసమానలావణ్యవతియు నగు పద్మినిం బెండ్లియాడెను. ఆదేవి చక్కఁదనమును సౌకుమార్యమును నెఱజవ్వనమునుఁ బట్టి భూలోకమున నిట్టి సౌందర్యవతి లేదని యాకాలపుజనులు చెప్పుకొన దేశమంతట నామెకీతి౯ వ్యాపించి యప్పటి ఢిల్లీచక్రవర్తియు నధమాధముఁడునగు నల్లాయుద్దీను చెవినిఁబడెను. ఈచక్రవతి౯ పరమదుర్మార్గుఁడు, చిన్నటనుండియుఁ దన్ను పెంచిన పినతండ్రిని జలాయుద్దీను చక్రవతి౯ని విశ్వాసఘాతకుఁడై చంపి సింహాసన మెక్కెను. గద్దెయెక్కినది మొద లతఁడు ప్రజలను మంగలములోబెట్టి వేచినట్లు పలువెతల గుడివెను. ఆచక్రవతి౯ తనయాగ్రహమునకుఁ బాత్రులగు మందభాగ్యులనుఁ గన్నులు బొడిపించియు ధనము హరించియుఁ జెఱఁబెట్టించియుఁ జంపించియు నాలుబిడ్డల బిచ్చగాండ్రఁ జేసియు ననేక చిత్రవధల పాలుఁజేసి కలియు