ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బప్పరావుల కథ.

11

సామంత రాజపుత్రిక లఁ బలువుర పాణిగ్రహణము జేసికొని యాకన్నెల వలన నూటముప్పదుగురు కుమారులం గనె నని చెప్పుదురు. ఈకోడుకులే నూటముప్పది పటానుతురుక తెగలకు వంశకర్తలై యుండె నని ప్రసిద్ధి గలదు. మున్ను చిత్తూరిపై విసుకు పుట్టినయట్ల కోరాసాను పై సయిత మాతనికి విసుగు జనింప నతం డా దేశమును వైభవమును విడిచి తిరిగి పరమపావనమగు మహా మేరు శైలము నెక్కి జితేంద్రియుఁడయి సన్యసించి జపతపంబుల కాలముపుచ్చి యెట్ట కేలకు శతవృద్ధయి శరీరము విడిచెనఁట. ఈతఁడు చచ్చి లోకము విడిచినను, నద్భుతములు, మహిమలు వీనిని విడువ వయ్యె. అతని మొదటి ప్రజలకు హిందువులును, తరువాత ప్రజ లగుమ్లేచ్ఛులును వాని కళేబర విషయమై వివాదపడిరి. హిందువులు తద్దేహము నగ్ని సంస్కారముఁ జేయవలయు ననిరి. మేచ్చులు నేలం బూడ్చి పెట్టవలయు ననిరి. ఇట్లు కొంత తడవు మ్లేచ్ఛ హిందువులు కార్యనిశ్చయముఁ జేయ లేక వివాద పడు చుండ నప్పుడందులో నొకఁడు శవముమీఁదఁ గప్పినబట్ట నించుక యెత్తెను. అప్పటియద్భుత మే మని వర్ణింపను. ఆస్థానమందు బప్పరావుల శరీరముఁగాని దానిజాడఁగాని యొక్కింతయు గానఁబడక పోవుటయేగాక, శవమును పండుకోనఁ బెట్టిన చోట భూమిలోనుండి లెక్క లేని తామరపువ్వులు 'మొలక లెత్తేను. ఈవిధమునఁ బప్పఁ డద్భుతముగా,న స్తమించెను. ఈ బప్పరావు లే, మివారు సంస్థానము "నేలు శిశోదయ వంశజులగు రాజులకు మూలపురుషుడు. అతని యనంతరమున సింహాసనమునకు వచ్చిన ప్రభువులుఁ గొందఱు బప్పనివ లెనే రావులని బిరుదము వహించిరిగాని, యిటీవలవారు రాణాయను నామము ధరించిరి. బప్పరావుల కాలము మొదలు చిత్తూరు రాజు లచ్చటి శివాలయమునకు ధర్మకర్తలై వారు స్వయముగా నాలయమునకుఁ బోవునపుడు దేవునకు నర్చకులై యుండెడు నాచారము గలదు.