ఈ పుట అచ్చుదిద్దబడ్డది

200

రాజస్థానకధావళి.


ఈనడుమ మీవారు రాణా పరలోక గతుఁ డయ్యెను. కరుణుని కుమారుఁ డగుజగత్సింగు తండ్రి పరోక్షమున రాజ్య పతిష్ఠితుండై యెప్పటియట్ల షాజహానుతో నెయ్యముఁ బాటించుచుండె. జగత్సింగు రాజయినపిదప షాజహానుఁడు కొన్ని దినము లుదయ పురమున వసియించి యుండెను. అతఁ డక్కడ నుండఁగ నే జహంగీరుచక్రవతి౯ కాశ్మీర దేశమునందు దగ్గుబాధ చేతఁ గాలధర్మము నొందెనని వత౯ మానము తెలిసెను. షాజహానుఁడు సరోవర మధ్యమున నున్న మేడలో నున్నపుడె రాణా మొదలగు సామంత రాజులు తమ కొత్తచక్రవతి౯ దర్శనము ముందుగఁ జేసి కానుకలు సమర్పించిరి. షాజహానుఁడు సింహాసన మెక్కుటకు ఢిల్లీకిఁ బయన మయి పోవునపుడు మీవారు రాణాకు వెనక వానివద్దనుండి తీసికొనిన యయిదు జిల్లాలను మరల వాని కిచ్చి వేలలేని కెంపోకటి బహుమాన మిచ్చి యవసర మయిన పక్షమునఁ జిత్తురు కోట బాగు చేసికోని యుపయోగించుకొమ్మని సెలవిచ్చి యుదయపురము వెడలెను.

జగదీశ్వరుఁ డగు ఢిల్లీశ్వర నిపుత్రుఁ డుదయపురమున నుండి నట్లు రెండుమూడానవాళ్ళిప్పటికిఁ గలవు. షాజహానుని డాలోకటి, కుసుంబావర్ణము గల వాని తలపాగ యొకటి. ఈతలపాగ పాజహానుఁడు తనతల మీఁదనుండి తీసి రాజపుత్రు లిచ్చిన శిరోవేష్ట మొకటి ధరి యించెను. మొదట చుట్టినప్పు డెన్ని మడత లున్నవో యన్ని మడతల నిప్పటికిఁ గలిగి చుట్టినది చుట్టినట్లున్నది. జగత్సింగు బుద్దిశాలి యయి యిరువదియాఱు సంవత్సరములు రాజ్యము చేసి చక్రవతి౯ యనుగ్రహమునకుఁ బాత్రుఁ డయి కాలము గడపె. షాజహాను తక్కిన సంస్థానములకంటె మీవారు నెక్కుడుదయతో నాదరించుటచే నా రాజ్యము పాడిపంటలు గలిగి వర్ధిల్లెను.


మొదటి భాగము సమాప్తము.