ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బప్పరావుల కథ.

9

మును బట్టి యామెకు నదివఱకె వివాహ మయినదని చెప్పెను.ఊరి పెద్ద లీమాట విని మితిమీరిన యలుకచే మండిపడి బాలికను నొక్కి యడుగ నామెయు భయపడుచు నెనుక నెఱపఁబడిన యాట పెండ్లి నెఱిఁగించెను. ఆ తెగవారి శాస్త్రమును బట్టియు, నాచారమును బట్టియు, గొంగులు ముడి వేయుటయుఁ జేతులు పట్టుకొనుటయుఁ జెట్టు చుట్టు తిరుగుటయు, నిజమయిన వివాహమును సూచించుటం జేసి బప్పఁడు గ్రామమునందలి యారువందల కన్యలకు విధిగా మగఁ డయ్యె నని పెద్దలలుక జెందుటకు తగినంత కారణము లేకపోలేదు. తనతోడి పసులకాపరులలో నొకనివలన నీసంగతిని బప్పఁడు విని క్రోధ పరవశు లగు మామగార్ల బారినుండి తప్పించుకొని తత్వణ మాగ్రామమును విడిచి కొంతదవ్వరిఁగి గొప్ప బయలు నేల నొక రాతి పైఁ గట్టఁబడిన చిత్తూరినగరముం బ్రవేశిం చెను, ఆకాలమున చిత్తూరునగరము మాళవ రాజవంశస్థుఁ డగు బప్పని మేనమామ పాలించుచు, చిరకాలము క్రిందటఁజూ చినతన తోఁబుట్టువును మేనయల్లుని గారవించెను. ఎవరో యెచ్చటనుండి వచ్చెనో యెవ్వరికిం దెలియని యా క్రోత్తచుట్టా లపై రాజునకుం గలయాదరంబును గారవంబునుఁజూచి 'రాజాశ్రితులందఱుఁ గడునల్లి తమపట్టణము పై నొకశత్రువుదండెత్తిరా వారందఱు నతనికి సహాయముగాఁ బోరరయిరి. రాజు వారిని సాయ మడుగ మేనమామ చేసిన యాదరంబున కెల్ల బప్పఁడు తగినవాఁడైన పక్షమున యతఁ డొక్కఁడే పగతురం దాఁకి జయింపఁగలఁడు. ఇంక మాసహాయ్య మెందుకు? కావలసినయెడల మామడిమాన్యములనైన వదలుకొని మే మెందయినఁ బోవుదుము. కాని, నీపక్షమున బోర మని రాజునకు వారు ప్రత్యుత్తర మిచ్చిరి. బప్పఁడు జంకును గొంకును లేక యొక్కఁడే యుద్ధమునకు సిద్ధ మయ్యెను. ఆతని సాహసమును జూచి సరదారు లందఱుఁ దమతమ మనస్పర్ధలను విడిచి సిగ్గుపడి యెట్టకేలకుఁ బప్పని వెంట రణంబునకుం బోయిరి. నాటికలహంబున శత్రు