ఈ పుట అచ్చుదిద్దబడ్డది

182

రాజస్థానకథావళి.


స్వామియానతి యలంఘ్యమగుటచే మావటీడు విధిలేక యేనుఁగు నంకుశముతోఁ బొడిచి కవాట భేదమునకుఁ బురిగొల్పెను. కొల్పుటయు నమ్మదగజంబు హుంమ్మని యుంకించి కుంభ స్థలముతో దలుపులను ద్రోయుటయు తలుపులు పళపళ పగిలి విడిపోయెను. శూరశిఖామణీయగు నచలుఁడు ఇనుపబొగడల పోటుల చేత మేనెల్ల జలైడవలెఁ జిల్లులువడ నెత్తురులు గ్రక్కుకొని క్షణములో శవమయి నేలం బడియె, కవాటంబులు విడి పోవుటయు మదగజంబుల వెంట బలుఁడు మొదలగు సూక్త వతులు యచలుని శవము మీఁదనుండి నడిచి కోటలోఁ బ్రవేశించిరి. అట చందావతులు వచ్చిన విధము వినుఁడు. ముందుగా వారు తెల్లవారుజాముననే బయలు దేరి దైవవశమున దారి తప్పి యొక పఱ్ఱలోఁ బ్రవేశించి తెన్ను గానక సిలుగులంబడి పడి సూక్తవతులు ముందుగాఁ గోటఁ జేరిరి కాఁబోలునని వగచుచుఁ జేయునది లేక యెట్ట కేల కొక గొల్ల వానిఁ గలిసికొని వాని సాయమున దారి నెఱిఁగి కోటం జీరిరి, సలుంబ్రా నిచ్చెనలుకూడఁ దెప్పించి గోడలకు వేయించి తన సైనికులు తాను బురుజుల పయి కెగఁబ్రాక మొదలు పెట్టిరి. అప్పుడు దుగ౯రక్షకులు తత్తరపడి కొంద ఱామూలకుం జేరుకొని చందావతుల నిచ్చెనల పడద్రోసి తుపాకులతోఁ బెక్కండ్ర గొట్టి చంపి విజృంభించిరి. అట్లు చచ్చిన వారిలో మొదటివాడే సలుంబ్రా. చందావతుల యీ దురవస్థకుఁ దోడు సూక్తవతుల జయధ్వనులు చెవులకు శూలములట్లు దాకెను.

నాఁడక్కడకు వచ్చిన చందావతులలో నొక చండశాసనుఁ డుండెను. అతఁడు దేవఘరుకోట కధిపతి, వేఁటలలో నడవిమృగములను యుద్ధములలో మనుష్యులను నిర్భయముగా నతఁడు చంపినట్లు ఎవరును చంపఁ జాలరఁట. ఆజగజెట్టి సలుంబ్రా మృతినొందిన తోడనే నిర్పిణ్ణుఁడు గాక' రౌద్రమూతి౯ యయి యాశవమును తన శాలువలోఁ జుట్టి భుజముపైఁ బెట్టుకొని గోడపయి కెక్కజొచ్చెను. అత్తరి