ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బప్పరావులకథ.

7

యావును వెదకికోనుచు వచ్చె ననియుఁ జెప్పెను. సిద్ధు డాపలుకులు విని వాని సాదరించి యాగో వనుదినంబు నాకొండ చరియకు వచ్చి పాలు తనకును దేవుసకు నొసంగుచుండెనని చెప్పెను. అది మెదలాగోవు మంద నుండి తప్పిపోయిన పుడెల్ల దాని వెదకుచు బప్పఁడు సిద్ధుని నెలవునకుంబోయి వాసి దర్శించి కడుభక్తి వాని పాదములం గడిగియెడ నెడ పాలు, పండ్లు నాహారములుగ సమర్పించుచు వానికిం బ్రియశిష్యుఁ డయ్యెను. సిద్ధుఁడును బప్పనియెడఁ బ్రసన్నుండై శైవరహస్యముల నుప దేశింప నాత్మను పరమశి భక్తుఁ డయ్యెను. ఆ ముని బప్పనికు పనయనము జేసి మంత్రోప దేశము చేయ మంత్ర మహిమ చే నాతనికొక నాడు ఈ శివుని భార్య యగు మహిషాసుర మర్దని వ్యాఘ్ర వాహన మెక్కి రక్తాంబరంబుల ధరియించి ప్రత్యక్షమై, శత్రునిర్మూలన సాధనంబగు వీటెయు, విల్లును నమ్ములపొదియు, నొసంగుటయే గాక మనుష్యకృతముగాక కేవల విశ్వకర్మ నిర్మితమై యిరుపక్కల వాఁడిగల యొక మహాఖడ్గమును గూడఁ బ్రసాదించెను. ఆఖడ్గ మతిభార మగుటచే దివ్యపురుషులు మహాశూరులు దక్క సామాన్యులు దానిం దాల్ప నోపరు. దేవి యిట్లాతని ననుగ్ర హించుటయు సిద్ధుఁడు బప్పనింజూచి “వత్సా! రేపు నీశరీరము విడిచి దివికిం బోవుదును. కావున నీ వరుణోదయము గాక మున్ను వచ్చి నా కట్టకడపటి దీవెనలం బడయు ' మని యానతిచ్చె రాజకుమారుఁడును తఱువాత తప్పక వచ్చునట్టు నచ్చఁ బలికి మునిని వీడ్కొని పోయేను. కాని పెందలకడ నిద్ర మేల్కొనంజాలక కొంత ప్రొద్దెక్కిన వెనుకఁ నతఁ డాకోండచరియకు వచ్చి చూచునప్పటికి సిద్ధుడందు లేఁ డయ్యె. ఆమహా పురుషుని కోఱకు బప్పడు పొదలు, పుంతలు, పొలములు వెదకి వేసారి యెందునుం గానక యెట్ట కేలకు నాకసము వంకఁ జూచెను. అప్పుడు మహేంద్ర లోకమునుండి వచ్చి కన్నులు మిరుమిట్లు గొలుపు దేదీప్యమాన