ఈ పుట అచ్చుదిద్దబడ్డది

162

రాజస్థానకధావళి,


ముగ సంహరించెను. వనవాసు లగుభిల్లులు విధేయులై మిత్రులై వానికిఁ గన్నులట్లు చెవులట్లు నుపచరించిరి. ఒకానొకప్పు డతఁడు పలాయితుఁ డగుటకు వీలు లేనపుడు దైవమే వానికి సాయముఁ జేయుచు వచ్చె. అది యెట్లన నయ్యడవులలో నాకస్మికముగఁ గాఱు మబ్బులు పొడమ, జడివానలు దిమ్మరించి మొత్తు చుండును. అందుచే వాగులు నేఱులు కొండ కాలువలు నిండి మార్గ మరికట్టుటయేగాక దేశ మంతయు జలమయ మయి యుండును. చక్రవతి౯ సైన్యము లాకారణమునఁ బ్రతాపుని విడువ వలసి వచ్చుచుండును.

ప్రతాపుఁ డెక్కడనున్న నక్కడనే యతనికొలు వుండును. రాజ్య పరిపాలనము చేయుచున్నపుడు, బ్రష్టుఁడై తిరుగుచున్నఫుడు, గృహమునం దున్నపుడు, కారాగృహమందున్నపుడు కూడ ప్రతాపుఁడు రాచరికమె చేసెను. సింహాసనముమీఁద నున్నపు డెంత గౌరవమొ నిరాధారముగఁ జెట్టు క్రింద కూర్చున్నపుడు వానియెడ వాని యనుచరుల కంతె గౌరవ ముండెను. చెట్లనుండి గోసిన పండ్లు, బీడు గడ్డితోఁ జేసినరొట్టె తప్ప వారికి వేరాహార మేదియు లేదు.రాణా తన కొలదియాహారములోనుండి యొక భాగమును దీసి దయతో నేసేనాధిపతి కైన నిచ్చేనేని తొల్లి యుదయపురమున మహైశ్వర్య సంపన్ను లైననాఁడు దయచే నిచ్చిన బహుమానముల కెంత సంత సించుచువచ్చెనో యిప్పుడు నతఁ డంతియ సంతస మొందుచుండెను. కడుపునిండఁ గూడు లేక కట్ట సరియైన గుడ్డ లేక తల దాచుకొనుటకుఁ దాపు లేక యర చేత ప్రాణము లుంచుకొని యొకయడవినుండి యొక యడవికిఁ దిరుగునా శూర శిఖామణులవద్దఁ గనఁబకు పరస్పర ప్రేమము గౌరవము వేఱోండు తావునఁ గనఁబడుట యరిది.అతని యనుచరు లీకష్టములఁ బడుటకంటె ఢిల్లీ చక్రవతి౯కి లోఁబడితి మని యొక్క మాట నోట నుచ్చరించినఁ జాలు. వెంటనే వారి కేలుట కూళ్ళు, నడుపుటకు సేనలు, వహించుటకు బిరుదుల, కావలసినన్ని వచ్చి పడి