ఈ పుట అచ్చుదిద్దబడ్డది

156

రాజస్థానకథావళి.


ఆరాజసింహా మాvaలకుఁ జనినపిదప వెనుక చిత్తూరు ముట్టడిలోఁ జెక్కు చెదరక బ్రతికిన తువారువంశస్థుఁడున వానికుమారుఁడును రాజప్రాణ సంరక్షణార్థము ధ్వజము పట్టుకొనిపోయిన జాలవంశస్థుడును ఉక్కుతునుకలవంటి మఱియేనూరు రాజపుత్ర వీరులును హోరాహోరీగాఁ దురకలతో యుద్ధము చేసి మృతినొంది వీరశయన మలంకరించిరి. నాఁడు యుద్ధమునకు వచ్చిన యిరువది రెండు వేల రాజపుత్రులలో నెనిమిది వేలుమాత్రము గాయములతో బలాయతులై రి. అప్పుడు శూర శిఖామణియైన ప్రతాపుఁడు వెంటనొక్క ఒక బంటయినను లేక యోంటరిగ గుఱ్ఱము నెక్కిఁ దనకు శరణమీయగల తావు లవియే యని కొండలలోనికిఁ బోవు చుండెను. రాజపుత్ర సైనికులు శత్రువులు తమ రాణా మీదికిఁ బోకుండ వారినాపి పోరుచు చేతనయినంత సాయము చేసిరి. తన కుమారుఁడగు సుమ్రా తాను మృతినొందినచో స్వదేశమును గాపాడఁ దురకల నెదిరింప లేఁ ని రాజ్యలక్ష్మి నిమిత్తము ప్రతాపుఁడు కొంత కాలము బ్రతుక నిశ్చయించుకొనియుఁ దనతోడి వీరులు గౌరవముగ రణరంగమునఁ బ్రాణములవిడిచివీర స్వగ౯మును గొల్లఁ గొనుచున్నందుకునుఁ దాను పిఱికి వాఁడై యేకాకియై ప్రాణములు గాఁచుకొనుటకు బ్రతికివచ్చినందుకు నతఁడు తద్దయు విచారించుచుఁ గైటకము నెక్కి మెల్ల మెల్లగ రాళ్ళనడుమ బయనము సేయుచుండ నంతలో వాని వెనక గుజ్జపు డెక్కల చప్పుడయ్యె. అప్పుడేమీ యని యతఁడు తిరిగి చూచునప్పటికి నిద్దఱు తురకలు వానిని బట్టుకొనుటకు వెంట దగిలివచ్చుచుండిరి. వారికంటెదూరముగ నింకొకఁడు వచ్చుచుండెను. గుఱ్ఱముకంటె ప్రతాపుఁడును ప్రతాపునికంటె గుఱ్ఱమును నలసియుండిరి. గోరుచుట్టు పై రోకలిపోటువిధమున వారి దారి కడ్డుగ కడు వేగమునఁ బాఱు నొక కొండయే ఱడ్డమువచ్చేను. ప్రతాపుఁడు కైటకమును కొంచెము తరట చేయ నది యెక్కడ లేని యోపికఁ దెచ్చుకొని నొక్క యెగు రెగిరి యేఱు దాఁటి యావలంబడియె, తరుము