ఈ పుట అచ్చుదిద్దబడ్డది

150

రాజస్థానకథావళీ.


కంటె నెక్కువ గౌరవించుచుండెను. అతని పట్టపు దేవి యగు జహంగీరుతల్లి రాజపుత్రుల యాఁడ పడుచు. ప్రధానమంత్రులలో నొకఁడైన తోడరుమాలు రాజపుత్రుఁడు మఱియు నంబరుసంస్థానాధిపతి యగు భగవాను దాసుఁడును వాని యన్న కొడు కగు మానసింగును సేనాపతులై చక్రవర్తిని గొలుచుచుండిరి. ప్రజలనిమిత్తము చట్టములు చేయునప్పు డక్బరు చక్రవర్తి యతి బాల్య వివాహము, యజ్ఞము లలో జీవహింస, బలత్కారసహగమనము, మోదలగు దురాచారములు జరుఁగ గూడదని నిషేధించి హిందువులకుఁ గొంచె మనిష్టమే గలిగించినను మొత్తముమీఁద సర్వమత సహనముఁ గలిగి యెవరి మతము వారి పూజలు తనకోటలో సయితము జేసికోనవచ్చు నని యెప్పుకొని గోవుల నితర జాతుల వారుగూడ చంపగూఁడ దని కట్టుబాటు చేసి ధర్మోత్తరముగఁ బ్రజా పాలనము చేసెను. ఈ సౌమ్యత వలన నక్బరు నకు ననేక రాజపుత్రులు లోఁబడి కప్పముఁ గట్టుటకు సమ్మతించిరి; కాని చిత్తూరునగరమును నాశనము చేసి తానుగొండ నలోనికిం బాఱఁదోలినను రాణాల కింకను బుద్ధి రాలేదని యక్బరు విచారింపజొచ్చెను. రాజపుత్రులియెడల చక్రవర్తి, చూపుదయా గౌరవాదులం బట్టి స్వమతాభిమాన మెక్కుడుగల మహమ్మదీయుల కక్బరుపై కోపముగూడగలిగెను. కాలక్రమమున రాణాకును జక్రవర్తికిని దొంగ పోటు యుద్ధములు కడముట్టి ప్రబలయుద్ధములు జరుగ నారంభించెను. దానికి కారణము రాజపుత్రకవు లిట్లు చెప్పియున్నారు.

"అంబరురాజవంశస్థుఁ డగుమానసింగు చక్రవర్తి పంపున నేదేశమునతో పోయి పగతుఱ జక్కడఁచి మరల ఢిల్లీకిఁ బోపుచు మార్గ వశమున మీవారు దేశములో నుండి పోవలసి వచ్చెను. ప్రతాపసింగు ధనహీనుఁడై దుర్బలుఁడై యుండినను ముప్పది యాఱు రాజపుత్ర కుటుంములకు నాయకుఁడై వెలయు చుండుటచే, "మహారాణా వారి దర్శనము నేను జేసికొనవలయునని యున్నది రావచ్చునా? "యని