ఈ పుట అచ్చుదిద్దబడ్డది

4

రాజస్థానకథావళి.

దినములయం దాచారమయి యుండెను. భిల్లుల కులవృద్ధు తద్వృత్తాంతము విని సంతసించి తమ యీదూరుగ్రామ మశేషము గౌహునకు పుత్ర పౌత్ర పారంపర్య మేలుమని యర్పించి, యెల్ల బిల్లులకు వానిదొరగా నొనర్చెను. నాఁటనుండియు తద్వంశస్థులు గిహలోటు లని చెప్పఁ బడుచున్నారు. ఇట్లు గిహలోటు లీదూరిపురమును, భిల్లులను, నెనిమిదితరముల వఱకుఁ బాలించిరి. అనంతరము భిల్లులు క్రొత్త వంశపు రాజు పరిపాలనకు విసువు జెంది వారి నెట్టయిన దేశమునుండి పారఁదోలఁ దలఁచు చుండిరి. ఒకనాఁ డప్పటి రాజు వేటతమకంబున తిరుగుచుండ భిల్లులు వాని నాకస్మికముగఁ దాఁకి వధించిరి. అప్పుడు రాజకుటుంబ మెందేని తలఁ దాఁచుకొనవలసి వచ్చె. పూర్వము గౌహుని కాపాడిన బాహ్మణుని కూఁతురు సంతతివారు. వంశపారం పర్యముగ గురువులుం బురోహితు లగుటం జేసి తద్వంశజుఁ డగుబ్రాహ్మణుఁ డొకఁడు మృతినొందిన రాజకుమారుని మూడేండ్ల ప్రాయము వాని జేరఁదీసి చేరువ నట్టడవిలోనున్న యొక కొండకోటకుం దీసికొని పోవ నొక భిల్లుఁడు వానితండ్రిమిఁది విశ్వాసము చేత రహస్యముగ వాని నందు సంరక్షింపఁ జొచ్చె. అచ్చటఁ గొన్ని నాళ్ళు కడచిన పిదప పురోహితుఁడు రాజపుత్రున కచట యపాయము వాటిల్లు నని తలఁచి యిప్పటి యుదయపురమున కై దుక్రోసుల దూరమున నున్న నాగేంద్ర మను పుణ్య క్షేతమున కాకుఱ్ఱని జేర్చెను. ఈ పట్టణమున మూడు శిఖరములు గలయొక కొండ మొదట యేక లింగ స్వామి యను పేరఁ బరఁగు మహా దేవుని శివుని వానివాహన మగునందిని బ్రాహ్మణు లారాధించెడు వారు. అడవుల నేరుల నిండినయీ యేకాంత స్థలమున రాజపత్ని తనకుమారుని దాఁచి'పెంచుచుండె.అతనికి నామకరణ మేదియు జేయక తల్లి బప్పా యని పిలుచుచు యూరిపిల్లలతో పాటు పెరుగ నిచ్చెను. ఆ భాషలో బప్పయనఁ బిల్ల వాఁడని యర్థము. ఆయూరి పిల్లలవలె నాకుఱ్ఱఁడు నుదయము మొద ల స్తమయమువఱకు పశుల