ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చిత్తూరు మూడవముట్టడి.

133


పగతుర బారి బడకుండ దానిని సంరక్షించ లేదు. రాజస్థానకథావళిం జదివి మివారు రాజ్యము యొక్కయుఁ జిత్తూరునగరము యొక్కయు మహావైభవమును దెలిసికొన్న వారందఱుఁ జిత్తూరు యొక్క యీనాఁటి యవస్థం జూచిన పక్షమున మున్ను సకలైశ్వర్య సంపన్నమై బహుజన సంకులమైన యానగర మంత పాడుగ నుండుటకును రాజ్యలక్ష్మి కిట్లు వైధవ్యము గలుగుటకును కారణమేమని తలంపకపోరు. తలంచి విచారింపక పోరు. ఉదయసింగు హిరావళీ పర్వతములోనికిఁ బారిపోయి మరల నెన్నఁడు జిత్తూరురాక యాపర్వతముల సమీపముననే యుదయపుర మను పేర నొకపట్టణమును గట్టించి దానిని రాజధానినిఁ జేసికోని దేశమును పాలించుచు దనజీవితకాల శేషమును గడపెను. అందుచేతనే నేటికిని మీవారు రాణా యుదయపుర మహారాణా యను పేరం బిలువఁ బడుచుండును, ఉదయసింగు తనజీవిత కాలమంతయు మరలఁ జిత్తూరును బట్టుకొని విజయము నొందవలయు నని తలంచుచుండువాఁడు. అందు చేతఁ దనయుద్యమము నెరవేఱువఱకు గడ్డమును కత్తిరించుకొన నని యతఁడు ప్రతినఁ జేసెను. ఆ ప్రతిన నెరవేరక మునుపే యతఁడు లోకాంతరగతుఁడగుటం జేసి యాతని సంతతి వారగు నుదయ పుర మహారాణాలు నేటివఱకుఁ దమవంశకత౯వలెనే గడ్డములు కత్తి రించుకొనక యుందురు.

చిర కాలమునుండి మీవారు సంస్థానమునకు రాజధానియగు చిత్తూరు నగరమును నామావ శేషముగ నొనర్చి యక్బరు చక్రవర్తి చరిత్రము సంగ్రహముగా నిచ్చట దెలిపెదము. ఢిల్లీ పాదుషాలలో నక్బరు వంటి యోగ్యుఁడు గుణసంపన్నుఁడు మఱి యొకఁడు లేఁడని చెప్పవచ్చును. తండ్రి రాజ్యభ్రష్టుడై సింధు దేశపు టెడారులలోఁ జరియించుకాలమున 1542 సం౹౹రమున నమరకోట పట్టణమునందతఁడు జన్మించె ననియు జనకుని మరణానంతరము 1556 వ సం౹౹రమున బదునాలు గేండ్ల ప్రాయము వాఁడై యున్నపుడు సింహాసన