ఈ పుట అచ్చుదిద్దబడ్డది

2

రాజస్థానకధావళీ

తీర్చునటుల వాగ్దానముఁ జేయ, నాతఁడును దనఱేనిజ యరహస్యమును బగతుర కిట్లెఱిఁగించెను. "శిలాదిత్య మహరాజు సూర్యపుత్రుఁడు ఆతని ప్రభావమువలన కోటలోని యొక దివ్య సరస్సునుండి సూర్యాశ్వ మొకటి బయలు వెడలును. రాజు దాని పై నెక్కి కయ్యమునకుఁ బోవుటం జేసి విజయుఁడగుచున్నాఁడు. ఆ సరస్సు మైలవడిన యెడల భానుఁ డలుగును. ఆతనియలుకచే రాజున కాగుఱ్ఱము లభింపదు. అప్పుడు మీ రాతని సులభముగా జయింపవచ్చును. ” ఇట్లు పలికి వైరులను మహానందమగ్నులఁ జేసి దుష్టబుద్ధి యగు నామంత్రి నగరమునకుఁ బోయి యొక గోవును జంపించి దాని నెత్తు రాకొలంకునీటిలోఁ గలిపించి కలుషంబుగావించె. కొండొకవడికి వేగుల వాఁడొకఁడువచ్చి, దేవా ! శత్రువులు కోటపైఁ గవియుటకు 'మొనలుదీర్చియున్న వారని చెప్ప శాత్రవసేనలతోఁ బోరుమని తన బలంబుల కానతిచ్చి, యాధరణీశ్వరుఁ డెప్పటి యట్ల దివ్యసరోవరంబునకుం బోయి తనప్రియహయమును బిలిచెను. కాని తొంటియట్ల నీరొకిం చుకయుఁ గదల బారదయ్యెను. ఆ రాజేంద్రుఁడు తత్కారణ మరసి, తన మంత్రపటి మంబు చెడినదనియు, దనజనకుఁ డగుప్రభాకరునకుఁ దనవై ననుగ్రహంబు తప్పిన దనియు నిశ్చయించి సేనలం బురికొల్పికొని, మాయుధ పాణియైదుర్వార సంగ్రామం బొనర్చి దేశ సంరక్షణార్థ మై ప్రాణములు విడిచి కీతి౯ శేషుఁడయ్యెను. శత్రువుల వల్లభిపురంబును బట్టుకొని కొల్లకొనిరి. అప్పుడు దైవవశమున నగరమునందు తేమి నొక్కరితతక్క తక్కిన ఱేనికాంత లందఱుఁ జిచ్చుఱికి భర్తృసహగమనముఁ జేసిరి. ఆమె తన పుట్టినిఁటికి జని మరల భర్తృ సన్నిధికి వచ్చుచుండ దారిలో నొక సేవకుఁ డా రాణింగని శిలాదిత్యుఁడు లోకాంతరగతుఁ డగుటయు వల్ల భిపురము శత్రువులకుఁ జిక్కుటయు నాదిగాగల వృత్తాంత మెఱిఁగించెను. ఆ దేవియు గుండె లవియు తద్వార్తవిని, పిడుగడచిన తెఱంగున మూర్ఛిల్లి దరి లేని శోకాబ్ధిలో మునిగి వల్లభిపురంబునకుఁ బోవఁ గాళ్ళాడక నిండుచూలాలగుటచే