ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చిత్తూరు మూడవముట్టడి.

127


నేక రాజపుత్రులు ఢిల్లీశ్వరునకు లోబడినను సంధికిరాని మూర్ఖుడొకఁ డుండెను. అతఁడు చిత్తూరు రాణా యగునుదయసింగు.

ఆయన గర్వము చేతఁ బౌరుషము చేత నక్బరునకు లోఁబడక పోలేదు. సోమరితనము చేత మూర్ఖత చేత నతఁడు చక్రవతి౯ దర్శన ముచేసి సంధి కోరఁడయ్యె. ఉదయసింగు బాల్యము నతిక్రమించి యవనమును బ్రాపించి తన సంరక్షకుల నావలకుఁబంపి యొక యుం పుదుకత్తెను 'జేరఁదీసి దానివలలోఁ జిక్కి రాజ్య వ్యాపారాదివిముఖుఁడై దానితోడిదే బ్రతుకని యొడలుమఱచి యుండెను. అక్బరు మాళవదేశమును జయించి దాని రాజగు రాజబహదూరును బారఁదోల నుదయసింగు వానికి శరణ మిచ్చి యట్టిపనివలన గలుగు నష్టము నాలోచింపకయే వానిం దనకడ నుంచుకొనెను. అందుచే నక్బరు కుచ్చితుఁ డై పగఁదీర్చుకొనుటకు మీవారు పై దండు విడిసెను. ఢిల్లీ చక్ర వతి౯ యంటి వాఁడు మహా సేనాసమేతుఁడై తనపై కెత్తివచ్చుచున్నాఁడని వినియు నుదయసింగు విననివాఁడు వోలె నేప్రయత్నములు చేయక మొద్దువలె నూరకుండెను.

ఉదయసింగు స్త్రీకన్న నధముఁ డై యింటఁ గూర్చుండుటం జేసి వానియుంపుడుకత్తె నగరమునకు రాదలచిన దుస్థితినిఁ జూచి రోసముఁ దెచ్చుకొని పనిఁ జేయబూనెను. సిగ్గు లేనిదియు వంచకురాలు నైనను నాపడఁతి రాజస్థానమునఁ బుట్టినదగుటచే దేశాభిమానముం గలిగి పౌరుషవంతుఁడగు పురుషుఁడట్లు పనిచేయఁజొచ్చెను. వెనుకటి చిత్తూరిముట్టడిలో రాణి జవాహిరీభాయి చేసినట్లే యీమెయుఁ గవచము ధరించి పురుష వేషము వేసికొని సేనలం దోడ్కొని మొగలాయి శిబిరముం బ్రవేశించి యొకమా రక్బరు చక్రవతి౯ యున్న స్థలమునకే సాహసించి పోయెనఁట. ఇట్లేమే పనిచేయుచుండ దైవవశమున నక్బరు చక్రవతి౯ పనులతొందరచేఁ జిత్తూరు విడిచి సేనాసమేతుఁడై మఱియొక చోటికిఁ బోవలసివచ్చెను. చక్రవతి౯ చిత్తూరు