ఈ పుట అచ్చుదిద్దబడ్డది

120

రాజస్థానకథావళి.


చెను. ఆవలఁబడి యతఁ డొక సంవత్సరము మంచి సైన్యమును పోగుచేసి రాజపుత్ర వీరులకు నిలయమని పూర్వము పేరు పడిన కన్యాకుబ్జ నగరమువద్ద షర్ఖానుని గలిసికొని యుద్ధము చేసెను. అతఁ డప్పుడు తెచ్చిన సైన్యము వెనుక వాని తండ్రి యగు బేబరు తీసికొనివచ్చిన సేనవంటిది కాదు. ఆసేనలో లెక్కకు లక్ష మంది బట్లుండిరి. కాని వారందఱు చావు పేరు చెప్పిన నడలి పారిపోవువారే. అందుచే గొందఱు యుద్ధ ప్రారంభముకన్న మున్నే యాచోటు విడిచిరి. కొందఱుశత్రువుల మొదటి ఫిరంగిచప్పుడు వినిన తోడనే గుండెలు చెదరి చెల్లా చెదరై సిగ్గు లేక కాలికోలఁది పరుగెత్తిరి. హుమాయూను మరల ప్రాణములతో దాఁటిపోయి కొలఁది పరివారముతో నొక తావునుండి మరియొక తావునకుఁ బోవుచు నుండుట కిల్లు లేక భగవంతునిపై భారమువేసి తిరుగుచుండెను.

ఎంత మెత్తని మనసుగలవాఁ డై నను హుమాయూనునివద్ద తండ్రి కడనున్న పట్టుదలయుఁ బబ్ల యు గొంతవఱ కున్నట్లు గనఁబడు చున్నది. ఏలయన నతఁను తనకుఁ గలిగిన దుఃఖముచే నుత్సాహభంగమునందక నాపదలు గడచుచు కొత్త స్నేహితుల సంపాదించుకొనుచు దారపుత్రాది వియోగదుఃఖము ననుభవించుచు పదునైదు సంవత్సరములు గడపెను. మొట్టమొదట కొంతకాల మతఁ డతిదారుణములగు దుఃఖముల ననుభవించుచు నెప్పటికప్పుడు తలఁ గొట్టు కొనిపోవునట్టి యాపడలను గడచుచు సింధు దేశమునందు రాజపుత్ర స్థానమునందుఁ గల యెడారులలోఁ దిరిగెను. ఆయవస్థను గనిపెట్టి రాజపుత్రప్రభువులు చక్రవతి౯కి తమ యోపినకొలఁది ధనమును సైన్యము నిచ్చి సాయము చేసి వానిని సింహాసన ప్రతిష్ఠితునిఁ జేసిన పక్షమున మొగలాయివంశస్థులు సూర్య చందవంశస్థులు నెల్లకాలము కృతజ్ఞులై యుందురు; కాని యట్లు జరుగలేదు. హుమాయూను సహాయము చేయుమని జసల్మీరుసంస్థాన ప్రభువు నడుగ తన కత