ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చిత్తూరు మూడవ ముట్టడి.

119


దెబ్బలుతిని రాజ్యమును విడిచి యనామకుఁ డై యెందో యడంగి యున్న బహదూరుషా మరలఁ దలయెత్తి గుజరాతు మాళవదేశముల నాక్రమించుకొనెను. హుమాయూను కనఁబడినతోడనే షర్టానుఁ కొంచెము 'వెనుకదీసెను. చక్రవతి౯యు బంగాళమునఁ బ్రవేశించి పగతుఁడు పారిపోయెనుగదా యని గర్వించి యెప్పటియట్లు భోగాసక్తుఁడై కేళీఖినోదములతోఁ గాలము బుచ్చుచుండెను. వాని జాడ యెఱిఁగి షర్ఖానుఁడు దారు లరికట్టి చక్రపతి౯కి ఢిల్లీకి నుత్తర ప్రత్యుత్తరములు జరుగకుండ నాటంకము గలిగించెను. హుమాయూనునితమ్ము లప్పుడయినను వానికి సాయము చేయరయిరి. అందొకఁడు హుమాయూసు సేనకు భోజన పదాథ౯ములు పంపుదునని వెళ్ళి యాగ్రానగరమున దానే చక్రవతి౯నని లోకులకుఁ జాటఁ బంచెను. రెండవ సోదరుఁడు గద్దెయెక్కిన యాతమ్ముని నావలకుఁ బారఁ దోలెను; కాని గట్టిపగతుఁడగు షర్ఖాను విషయమున నేమియుం జేయఁడయ్యె. అందుచే హుమాయూను తన పగతునితో సంధి చేసికొనవలసివచ్చెను. అంతట సంధిమాటలు జరుగుచుండఁగా ప్రాఁత పగలు మరచిపోయి హుమాయూనుని సైనికులు శత్రు సైనికులతో మనసిచ్చి మాటలాడుచుండఁగా నాకస్మికముగా నొక్కనాఁడు షర్ఖా నుఁడు తన సైనికులం దీసికొని చక్రపతి౯ సేన పయింబడి నిద్రపోవు చున్న సిపాయిలను నందఱను గటిక వాఁడు మేఁకలం గోసి చంపినట్లు చంపెను. అప్పుడు హుమాయూలను ప్రాణములు దక్కుటయే దుర్ఘటమయ్యెను.

పరాజయమునందిన యాచక్రవతి౯ తాను తప్పించుకొని పారిపోవుట కేయుపాయమును గానక గంగానదిలో దుమికి యీదిపోవుటకుఁ బ్రయత్నించి మిక్కిలి శ్రమపడుచుండఁగా నీళ్ల కావటివాఁడొకఁడువచ్చి మేఁకతోలుతోఁ గుట్టిన యొకసంచి తెప్పగా చేసి దానిపై హుమాయూనుని గూర్చుండఁ బెట్టి యెట్టెటో నావలకు దాఁటిం