ఈ పుట అచ్చుదిద్దబడ్డది

110

రాజస్థానకధావళి.


దనియుఁ దెలిసినచో నతఁడు తన కెగ్గు సేయుననియుఁ జెప్పి వారిం దన రాజ్యమున నుండనీయక వేఱోక తావునకుం బంచె దాదియు, మంగలియు మఱల గంప నెత్తుకొని పయనమై యిట్టటుఁ దిరిగి దంజరుపురమను గ్రామము చేరిరి.

ఆయూరి రాజు నుదయసింగునకు దగ్గరచుట్టమే కాని తాను బలవంతుఁడను కాననియు బాలకునకు శరణమిచ్చినట్లుఁ దెలిసినచో వనవీరుఁడు తన ప్రాణముల దక్కనీయఁడనియుఁ గావున దాను సహాయము చేయఁజాలననియుఁ జెప్పి యతఁడు వారి నక్కడ నిలువ నీయక పయనము చేసి వేరొక తావునకుఁ బంపెను.

ఇట్లిరువురు చేత నిరాకరింపఁబడియుఁ బున్న మనో ధైర్యము విడువదయ్యె. మున్ను పృథివిరాజు కొంతకాలము వసియించిన కమలమియరుకోటలో నాకాలమున జైనుమతస్థుఁ డగునొకవత౯కుఁడు కొంత సేనం గూర్చుకొని వాసము జేయుచుండెను శూరుల మని వీరుల మని చెప్పుకోనుచు సమయమగునపుడు రాజపుత్రునకు శరణ మొసంగలేని యాక్షత్రియుల నాశయించుటకన్న మతాంతరుఁ డగు నీకోమటి నాశ్రయించుటయే యుక్త మని తలంచి పున్న బాలుని, మంగలిని వెంటఁ బెట్టుకొని కమలమియరుకోటకుఁ బయన మయ్యె.

ఆపున్న తానింత రాజపుత్ర స్త్రీయైనను ఉక్కు సరములునిండు పౌరుషముఁ గలమగవానికన్న తా నెంత ధైర్యముగల దైనను నొరు లెఱుఁగకుండ నామహారణ్య మధ్యమున నాకొండలమీఁద కనుమలం గడచి శిఖరంబుల నెక్కి దిగి సెలయేళ్ళ దాఁటి ఘాతుక మృగంబుల బారినుండి తప్పి యెట్లు కమలమియరుకోటఁ జేరినదాయని యాచిక్కు మార్గముల నెఱిఁగిన వారంద రాశ్చర్యపడకపోరు. ఆమె యసహాయయై యావన మధ్యమునం బో పునప్పుడు ఘాతుక మృగంబుకన్న నెక్కుఁడు ఘాతుకు లగుభిల్లులు మొదలగు నడవి మనుష్యులు సహిత మామె కథను విని జాలిపడీ యామెకుం దోడు పడిరి.