ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉదయసింగుని కథ

109


ముక్కలుగ లరికెను. నిదురించుచున్న దాసిపుత్రుఁడు నిదురించుచుండగనే కన్నతల్లికన్నులు ముందట యొక్క కేక వేసి ప్రాణములు విడి చెను, వన వీరుఁడును రాజ్యము నిష్కంటకమైనదని నమ్మి తాను రాణా నైతినని సంతసించి సంతుష్టితో సంతఃపురము విడిచిపోయెను.

రాజకుమారుఁడు బ్రతికియుండిన పక్షమునఁ దనవంటి దీనుల ననేకుల నన్నవస్త్రములిచ్చి పోషింపఁగలడని యెంచి దాసియగు పున్న తనజుం జిత్తూరు రాజకుటుంబము వారు చేసిన మేలు మరువక కృతజ్ఞతగలిగి రాజపుత్రుని ప్రాణములు గాపాడుటకై తనకుమారుని ప్రాణముల నర్పించి యుత్తమచరిత్ర గలదై యెల్లర చేతం గొనియాడ బడుచున్నది. రాజకుమారునకు దహనక్రియలు వాని ఠీవికిదగినంత గొప్పగా జరుపఁ బడెను. అవి ముగియువఱకు పున్న కన్నీరు సంతత ధారగాఁ గారు నట్లేడ్చి యనంతరమున కొత్త రాణా వద్దకు దక్కిన రాజు బంధువుల వద్దను సెలవు గైకొని రాచనగరుఁ బాసి యావలకుం బోయెను. పోయి పురము వెలుపల నేటిలో నిసుక తిప్పమీద గంపతో దనరాక కెదురుచూచుచున్న మంగలిం గనుగొనియెను. నల్ల మందు పెద్దమోతాదు ప్రయోగించుట చేతనో మఱి యేకారణము చేతనో యుదయసింగు గంపలోనుండి యంతవఱకును మేలుకొనలేదు. మారుమూల త్రొవలంబడి నొరులకంటఁ బడకుండ నడచి యాపున్న మెల్ల మెల్లగ దేవలనగరము జేరెను. ఆనగరమును జిత్తూరు రాజ్యము నిమిత్తము తన ప్రాణములు విడిచిన బాగ్జీ యను శూరశిఖామణి కుమారుఁడు పాలించుచుండెను. ఆతనివలన రాజపుత్రునతు సంరక్షణము జరుగునని దాసి ఫుట్టెడాస పెట్టుకొని యరిగెను. ఆరాజును రాజకుమారుని దాసిని సత్కరించి యాదరించెను. కాని చండ శాసనుఁడు వనవీరునకు జడిసి తనతన రాజ్యమునందా రాజకుమారుని నిలిపిన పక్షమున దేవలకోట చిత్తూరునకు సమీపమున నుండుటచే నావాత౯ వేగుల వాండ్రవలనఁగాని మఱియొకరివలనఁగాని వనవీరునకుఁ దెలియకపో