ఈ పుట అచ్చుదిద్దబడ్డది

106

రాజస్థానకథావళీ.


విశ్రాంతకీతి౯యు నగు పృథివిరాజునకొక కుమారుఁడు గలఁడు. వాని పేరు వనవీరుఁడు. హిందీ భాషలో వానిని బన్బీరు డందురు. అతనిని చిత్తూరు రాజ్యసంరక్షకునిగా నేర్పఱచు టుచిత మని వారు నిశ్చయించిరి. అతఁడు బలసంపన్నుఁడును సింహవిక్రముఁడు నగుపృథివి రాజునకుఁ గుమారుఁడు నగును గాని దాసిపుత్రుఁ డగుటచేత వానివి వారు రాణాగాఁ జేసికొనఁజాలక కొన్ని సంవత్సరములపాటు చిత్తూరు రాజ్యమున కతఁడు సంరక్షకుఁడు గా నుండి దానిని గ్రమస్థితిలోనికిఁ దెచ్చినపక్షమున నింతలో నుదయసింగు యుక్తవయస్కుడై పరి పాలనకుఁ దగినవాఁ డగునో కాఁడో తెలిసికొనుటకు వీలు గలుగునని నిశ్చయించిరి.

వనవీరుఁడు తోలుదొల్త సందేహించి సూర్యవంశ ప్రదీపకులు మహాసాహసులు నగు చిత్తూరు రాజులు పాలించిన రాజ్యమును తనవంటి హీనకులజుఁడు పాలింపఁదగదనియుఁ గావున తన కదిష్టము లేదనియు వారిం భ్రార్ధించెను. కాని రాజపుత్రవీరుల దఱు జిత్తూరురాజ్యము యొక్క దురవస్థను వర్ణించిచెప్ప రాజ్యలక్ష్మీ నట్టిదురవస్థనుండి తప్పింపఁగల సమర్ధు డతఁ డుతక్క వేరొకఁడు లేడని నొక్కి పలికి బ్రతిమాలుటచే వారిమాటం దోసిపుచ్చలేక యెట్ట కేల కతఁ డంగీకరించెను.

కార్యగతు లిట్లుండ విక్రమజిత్తుని సవతితమ్ముఁడగు నుదయసింగు పసిబాలుఁడగుటచే రాజపుత్ర ప్రభువులు చేయు కుట్రలెఱుఁగక యాఁకలి యగునప్పుడు భుజించుటయు వేడుక గలిగినప్పు డాడు కొనుటయు నిద్రవచ్చినప్పుడు పవ్వళించుటయు వ్యాపారములుగ నంతి పురమున బెఱుగు చుండెను. తల్లిదండ్రులు చిన్న తనమందే గతించుటచే పున్న యను నొకదాసి వానికిఁ దల్లియై పెనుచుచుండె అది తల్లిగా తనయీడు వాఁడగు దాని కోడుకు తనకుం, జెలికాఁడుగా నుదయసింగు క్రమక్రమముగా నభివృద్ధి పొందుచుండె.