ఈ పుట ఆమోదించబడ్డది

క. నానా విభవాకరమై
మానససంజాతజాతమహిమార్ణవమై
కైనికతరమై[1] యాసుఖ
మానందబ్రహ్మమైన హరి యేమఱచెన్. 31

చ. పరవశుఁ డైన శౌరిఁ గని పంకజలోచన రాధికామణిం
దొఱఁగు మటంచు వేడికొనఁ ద్రోయక నాథుఁ డొసంగె నమ్మికల్
పురుషల కేటి సత్యములు పూనిక లేడవి పుణ్య మెద్ది నీ
మరు లిటు కొండలై పెరుఁగు మాత్రమె కాని కురంగలోచనా. 32

వ. అని యి ట్లాడు చిలుకను జూచి. 33

శా. ఏ మేమే వెఱ పింత లేకనె భళా హేమాంగి యి ట్లాడెనా
యామాట ల్విని మంచి దం చనియెఁగా యా ధూర్తుడు న్మించె హా

  1. కానికతరమై-తా. ప్ర, ము. ప్ర. కాని యామాట కర్ణము లేదు. కైనికతరమై అని సవరణ. ‘కీనము’ మాహాత్మ్యము. వైచిత్ర్యము , ఆనందము, సంతోషము సంస్కృతశబ్దార్థ కల్పతరువు.